Rashmika Meal : అభిమానుల కోసం ర‌ష్మిక మీల్… అందులో ఎలాంటి ఐట‌మ్స్ ఉంటాయో తెలుసా?

Rashmika Meal : క‌న్న‌డ ముద్దుగుమ్మ ర‌ష్మిక తన చూపుల‌తో అంద‌రని క‌ట్టిప‌డేస్తూ మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తుంటుంది. ఈ అమ్మ‌డు ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌గా, ఇప్పుడు తెలుగులోనే కాక త‌మిళం, హిందీ భాష‌ల‌లోను సినిమాలు చేస్తుంది. రష్మిక ‘గీత గోవిందం’ సినిమాతో స్టార్ హీరోయిన్స్ కేటగిరీలోకి చేరిపోయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ .. ‘భీష్మ’ సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

TheNewsQube-

ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమా చేస్తోంది. ఒక వైపున తెలుగులో స్టార్ హీరోయిన్ గా తన దూకుడును కొనసాగిస్తూనే మరో వైపున తమిళ .. హిందీ భాషల్లో కుదురుకునే పరయత్నాల్లో ఉంది. ఇక కన్నడలో ఎలాగూ ఆమెకి కావలసినంత క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ క్రేజ్ ను సౌత్ నుంచి నార్త్ వరకూ విస్తరించే పట్టుదలతో ఉంది.

అందువల్లనే పాప్యులర్ ఫుడ్ సంస్థ మెక్ డోనాల్డ్స్ దృష్టి ఈ బ్యూటీ పై పడింది. రష్మిక క్రేజ్ ను తమ బిజినెస్ కు జోడిస్తూ తెలివిగా ఒక ప్లాన్ చేసింది. రష్మిక ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ ట్రీట్ ను అందించబోతోంది. ‘ది రష్మిక మీల్’ పేరుతో ప్రత్యేక మీల్ కేటగిరిని రూపొందించింది. రష్మిక ఇష్టపడే ఐటమ్స్ తో కూడిన మీల్ ను ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు.

‘ది రష్మిక మీల్’ ప్యాకేజ్ లో మెక్ స్పైసీ .. ఫ్రైడ్ చికెన్ .. మెక్ స్పైసీ చికెన్ బర్గర్ .. పెరి పెరి ఫ్రైస్ .. నింబూ ఫిజ్ .. మెక్ ఫ్లర్రి ఉంటాయి. ఫుడ్ విషయంలో రష్మిక ఎక్కువగా ఏం ఇష్టపడుతుందో తెలుసుకోవాలనే అభిమానులకు ఇప్పుడు ఆ జాబితా ఏమిటో తెలిసిపోయింది. ఇక వాటి టేస్టు ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చునన్నమాట.

‘ది రష్మిక మీల్’ను ప్రారంభించిన మెక్ డొనాల్స్డ్ ఇండియా (వెస్ట్ అండ్ సౌత్) మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అరవింద్ ఆర్ పి మాట్లాడుతూ .. “సెలబ్రిటీలతో సహా ప్రతి ఒక్కరూ మెక్ డొనాల్స్డ్ లో తమ గో టూ ఆర్డర్ ను కలిగి ఉన్నారు. రష్మికతో కలిసి పనిచేస్తున్నందుకు .. ఆమె అభిమానులకు ఈ స్పెషల్ మీల్ ను అందిస్తున్నందుకి సంతోషంగా ఉంది” అన్నారు.