Mass Maharaja Ravi Teja : రవితేజ చేసిన పని వల్లే మహేశ్ బాబు సూపర్ స్టార్ అయ్యాడని తెలుసా..?
NQ Staff - June 3, 2023 / 05:03 PM IST

Mass Maharaja Ravi Teja : వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా దాని మీనింగ్ మాత్రం నిజమే. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. రాత్రికి రాత్రే ఎవరైనా స్టార్ డమ్ ను సంపాదించుకోవచ్చు. కరెక్ట్ బొమ్మ పడాలే గానీ.. ఇండస్ట్రీని షేక్ చేసేయొచ్చు. కానీ దాన్ని పట్టుకోవడమే హీరోలు చేయగలిగిన మొదటి పని.
ఏ కథ ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియక కొన్ని కథలను వదిలేస్తారు. అలా రవితేజ చేసిన పొరపాటే ఆయన్ను ముంచేసింది. మహేశ్ బాబును సూపర్ స్టార్ ను చేసేసింది. ఆ సినిమానే పోకిరి. వాస్తవంగా ఈ కథను పూరీ జగన్నాథ్ బద్రి సినిమా సమయంలోనే రాసుకున్నాడు. రవితేజతో చేయాలని ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సత్యనారాయణ అనే టైటిల్ ను కూడా పెట్టుకున్నాడు.
కథ నచ్చడంతో రవితేజ కూడా ఓకే చెప్పాడు. కానీ అదే సమయంలో ఆయనకు తమిళ సినిమా నా ఆటోగ్రాఫ్ లో నటించే ఛాన్స్ వచ్చింది. అది రవితేజకు బాగా నచ్చిన సబ్జెక్ట్. దాంతో అందులో నటించాడు. ఈ లోగా పూరీ తన తమ్ముడితో 143 సినిమా చేశాడు. అప్పటికి కూడా రవితేజ డేట్లు ఖాళీగా లేవు. దాంతో పూరీని వెయిట్ చేయంచడం ఇష్టం లేక రవితేజ రిజెక్ట్ చేశాడు.

Mass Maharaja Ravi Teja Rejected The Pokiri Movie
అదే కథను మహేశ్ బాబుకు వినిపించాడు పూరీ. ఆయనకు కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మహేశ్ హీరోయిజం, పూరీ మేనరిజానికి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. రూ.10 కోట్లతో రిలీజ్ అయిన ఈ సినిమా రూ.40 కోట్ల వరకు వసూలు చేసింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే మహేశ్ సూపర్ స్టార్ అయ్యాడు. ఒకవేళ రవితేజ చేసి ఉంటే నెంబర్ వన్ హీరో అయ్యుండే వాడేమో.