RAVI TEJA: మ‌రో సినిమాకు సైన్ చేసిన ర‌వితేజ‌.. మంచి స్పీడు మీదున్నాడే..!

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ మంచి జోరు మీదున్నాడు. క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన ర‌వితేజ ప్ర‌స్తుతం ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి అనే సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌గా, మే 28న చిత్రాన్ని థియేట‌ర్స్‌లోకి తీసుకురానున్న‌ట్టు పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉండగా మరో రెండు సినిమాలకు కూడా మాస్ రాజా కమిటైనట్లు తెలుస్తుంది. తాజాగా ర‌వితేజ త‌న 68వ సినిమాగా త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

అభిషేక్ అగర్వాల్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా, ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. గులాబీ శ్రీను అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో సినిమా చేయడానికి రవితేజ సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మ‌రోవైపు బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలోను ర‌వితేజ ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 15 ఏళ్ళ కింద ఈ కాంబినేషన్ లో వచ్చిన భద్ర సినిమా ఎంత సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

Advertisement