Maruthi : మారుతి.. మంచి సినిమాలు తీయకపోతే ఇకపై కష్టమే..!

Maruthi : మారుతి ..టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో కొంత నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో సినిమా తీసే రేంజ్‌కు చేరుకున్నాడు. ‘ఈ రోజుల్లో’.. ‘బస్ స్టాప్’.. వంటి యూత్ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్స్ తీసి మెప్పించిన మారుతి. ఆ తర్వాత ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘బాబు బంగారం’, ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’, శైలజారెడ్డి అల్లుడు వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించాడు.

Maruthi .. it will be difficult anymore if good movies are not made ..
Maruthi .. it will be difficult anymore if good movies are not made ..

సాయి ధరం తేజ్ – రాశి ఖన్నా జంటగా తెరకెక్కించిన గత చిత్రం ‘ప్రతిరోజూ పండగే’తో డీసెంట్ హిట్ అందుకున్న మారుతి..కొంత గ్యాప్ తీసుకొని యాక్షన్ హీరో గోపీచంద్‌తో పక్కా కమర్షియల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలోనూ హీరోయిన్‌గా రాశి ఖన్నా నటిస్తోంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో మారుతి కథలు రాసే పనిలో బిజీలో ఉన్నాడు. ‘త్రీ రోజెస్’ అనే వెబ్ సిరీస్ కు కథ అందించాడు. ఇది ఆహా కోసమని తెలుస్తోంది. ఇలాగే మరికొన్ని కథలను సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు రాస్తున్నట్టు తెలిపాడు.

Maruthi : సినిమా బండి బాగా తీశారని ప్రశంసించాడు.

కరోనా కారణంగా పరిస్థితులన్ని తారుమారయినట్టు చెప్పుకొచ్చిన మారుతి ఇకపై కథ బావుంటేనే సినిమాలు చూస్తారని నాణ్యమైన సినిమాలు చేయకపోతే కష్టమని వెల్లడించాడు. చిన్న సినిమా అయినా ప్రేక్షకులను మెప్పించేదిగా ఉండాల్సిందేనని చెప్పిన మారుతి తాజాగా వచ్చిన సినిమా బండి బాగా తీశారని ప్రశంసించాడు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని తెలిపాడు. ఇక ఆయన తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్ త్వరలో మళ్ళీ సెట్స్ మీదకు రాబోతున్నారట.