Shruti Haasan: శృతి హాస‌న్‌కు పెళ్లి ప్రపోజ‌ల్‌.. ఈ అమ్మ‌డి స‌మాధానం ఏంటి?

Shruti Haasan క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండవం చేస్తున్న నేప‌థ్యంలో షూటింగ్స్ అన్ని స్తంభించిన సంగతి తెలిసిందే. దీంతో సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమిత‌య్యారు. ఎప్పుడు బిజీబిజీగా ఉండే వారికి ఇంత ఖాళీ టైం దొరికే స‌రికి ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. ఈ క్ర‌మంలో కొంద‌రు సెల‌బ్రిటీలు నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టిస్తూ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డిస్తున్నారు. తాజాగా దక్షిణాది నుంచి సినీ నటుడిగా పరిచయమై.. దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను దక్కించుకున్న నటుడు కమల్ హాసన్ వారసురాలు శృతి హాస‌న్ ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో పాటు పాత జ్ఞాప‌కాలు పంచుకుంది.


కెరీర్ ఆరంభం నుండే ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన హావభావాలను పలికిస్తూ నటిగా మంచి పేరును తెచ్చుకున్న శృతి హాస‌న్ దక్షిణాదిలోని దాదాపు అన్ని భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ పాన్ ఇండియా చిత్రం స‌లార్ చిత్రంలో న‌టిస్తుంది. ఇందులో శృతి హాస‌న్ పాత్ర అద్భుతంగా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇక ఈ ఏడాది శృతి హాస‌న్ న‌టించిన క్రాక్, వ‌కీల్ సాబ్ చిత్రాలు ఎంత పెద్ద విజ‌యం సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చి ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. నెటిజన్లు తమ మనసులోని ప్రశ్నలన్నింటిని ఆమె ముందు ఉంచారు.

స‌లార్‌లో మీ పాత్ర ఏమిటీ? క్రాక్ చిత్రంలో మాదిరిగా ఫైట్ చేస్తారా అన్న ప్ర‌శ్న‌కు స్పందించిన శృతి.. స‌లార్‌లో నాది మంచి పాత్ర , ఆ వివ‌రాలు ఇప్పుడే వెల్ల‌డించ‌లేను. ఫైట్స్ లాంటివి ఏమి లేవు. ప్ర‌భాస్‌తో ఫైట్ చేయ‌లేన‌ని పేర్కొంది. ఇక మ‌రో నెటిజ‌న్స్ మీ ఫోన్ నెంబ‌ర్ ఇవ్వ‌రా అని అడిగితే, దానికి శృతి… నా నెంబ‌ర్ కావాలా అని న‌వ్వుతూ నో చెప్పింది. మ‌రో నెటిజ‌న్ పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నో అంటూ సున్నితంగా తిరస్కరించింది. వైజాగ్‌కు ఎఫ్పుడు వస్తున్నారు అని అడిగితే.. చిన్నప్పటి నుంచి వైజాగ్‌తో అనుబంధం ఉంది. ఏదో సందర్భంలో వస్తూనే ఉంటాను అని శృతి చెప్పారు. కాగా, శృతి హాసన్ కొన్నేళ్ల క్రితం ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డిన విషయం తెలిసిందే. ఇప్పుడు అత‌నికి బ్రేక‌ప్ చెప్పిన శృతి మ‌రో వ్య‌క్తితో ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్న‌ట్టు తెలుస్తుంది.