manoj: మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం.. నా పెళ్లికి నన్ను కూడా పిలవండంటూ మ‌నోజ్ సెటైర్

manoj:టాలీవుడ్ యంగ్ హీరో మంచు మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటార‌నే విష‌యం తెలిసిందే. త‌న‌కు సంబంధించి ఏ రూమ‌ర్స్ వ‌చ్చినా కూడా వెంట‌నే స్పందిస్తుంటాడు. ఈ మ‌ధ్య కాలంలో సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మంచు వారబ్బాయి మనోజ్‌కు సంబంధించిన పెళ్లి వార్త హల్చల్ చేసింది.

TheNewsQube-
manoj denies rumours
manoj denies rumours

2015లో వివాహం చేసుకున్న మనోజ్‌ ఆ తర్వాత కొద్ది కాలానికే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగేండ్ల వైవాహిక జీవితం అనంతరం 2019 అక్టోబర్‌లో వీరిద్దరు విడిపోయారు. తమ ఇద్దరి మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల కారణంగా వీరిద్దరు విడిపోయినట్టు తెలిసింది.

ఒంటరిగా ఉంటున్న మ‌నోజ్ మ‌రి కొద్ది రోజుల‌లో రెండో పెళ్లి చేసుకోనున్నాడని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యం మ‌నోజ్ ద‌గ్గ‌ర‌కి చేర‌డంతో మనోజ్ సెటైర్లు వేశారు. ‘దయచేసి నా పెళ్లికి నన్ను కూడా పిలవండి’ అంటూ వ్యంగ్యంగా అన్నారు. ‘ఇంతకీ పెళ్లెక్కడ? ఎవరా బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల? మీ ఇష్టం రా, అంతా మీ ఇష్టం’ అంటూ బ్రహ్మానందం పిక్ తో ట్విట్టర్ లో తన స్పందన తెలియజేశారు.

అంతేకాదు, ఆ వెబ్ సైట్లో వచ్చిన కథనం లింకును కూడా మంచు మనోజ్ పంచుకున్నారు. కెరీర్‌ పరంగా చూస్తే నాలుగేళ్ల క్రితం `ఒక్కడు మిగిలాడు` చిత్రంలో మెరిశాడు మంచు మనోజ్‌. ఆ సినిమా పరాజయం చెందడంతో కెరీర్‌ పరంగా గ్యాప్‌ వచ్చింది. ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు మనోజ్‌. ప్రస్తుతం ఆయన `అహం బ్రహ్మాస్మి` చిత్రంలో నటిస్తున్నారు.

ఆ మ‌ధ్య మనోజ్ సినిమాలు మానేసి బిజినెస్ చేస్తాడంటూ కూడా ప్ర‌చారం జ‌రిగింది. దానిని కూడా ఖండించాడు మ‌నోజ్. రానున్న రోజుల‌లో వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తాన‌ని తెలిపాడు.