కరోనా మహమ్మారి మరో సారి బుసలు కొడుతుంది. పలు రాష్ట్రాలలో ఈ కరోనా ఎఫెక్ట్ అధికంగా ఉండడంతో కొన్ని ప్రభుత్వాలు సంపూర్ణ లాక్డౌన్ విధించాయి. నిర్లక్ష్యం కారణంగానే కరోనా మరోసారి ఇంతలా విజృంభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే రీసెంట్గా మనోజ్ బాజ్పాయ్ అనే బాలీవుడ్ నటుడు కూడా రీసెంట్గా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం డిస్పాచ్ అనే మూవీలో మనోజ్ బాజ్పాయ్ నటిస్తుండగా,సెట్లో కరోనా జాగ్రత్తలు తీసుకోకపోవడం.. యూనిట్లో ఒకరు నిర్లక్ష్యం చేయడం వలననే నాకు కరోనా వచ్చింది.
51 ఏళ్ల మనోజ్ బాజ్పాయ్ కరోనా వలన ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు తెలిపిన మనోజ్.. కరోనాతో జీవిస్తున్న మనం కరోనాని చుట్టు పెట్టుకొని పని చేయాల్సి వస్తుంది. అయితే దీంట్లో వాస్తవాన్ని స్వీకరించి జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్య్యంగా ఉండకూడదు అని అన్నారు. మనోజ్ నటించిన తాజా సినిమా ‘సైలెన్స్… కెన్ యూ హియర్ ఇట్’ జీ5లో మార్చి 26 నుంచి స్ట్రీమ్ కానుంది. మరోవైపు సమంతతో కలిసి చేసిన ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ కూడా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.