Anshu Ambani: మ‌న్మ‌థుడు బ్యూటీ అన్షు త‌న పిల్ల‌ల‌తో ఇప్పుడెలా ఉందో చూడండి..!

Anshu Ambani కింగ్ నాగార్జున న‌టించిన మ‌న్మ‌థుడు చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన న‌టి అన్షు. ఈ సినిమాలో ఆమె మాట్లాడే ముద్దు ముద్దు మాట‌లు, క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఆడియ‌న్స్‌నిఎంత‌గానో అల‌రించాయి. అతి తక్కువ సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అన్షు 2002లో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా, 2005లోనే ఇండస్ట్రీకి దూరమైంది.

మ‌న్మ‌థుడు చిత్రంతో పాటు ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమా లో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాల్లోనూ చనిపోయే పాత్రలే చేసింది అన్షు. ఆ తర్వాత ఎందుకో తెలియదు కానీ ఉన్నట్లుండి తెలుగు సినిమాలకు దూరం అయిపోయింది. కొన్ని కన్నడ సినిమాలు చేసిన తర్వాత లండన్ వెళ్లిపోయింది అన్షు. అక్క‌డే త‌న పిల్ల‌ల‌తో హ్యాపీగా ఉంటుంది.

అన్షు లండ‌న్‌లో పుట్టి పెరగడంతో అతిథిలా ఇండస్ట్రీకి వచ్చిందంతే. వెంటనే రెండు మూడు సినిమాలు చేసి చదువుకోడానికి వెళ్లిపోయింది. ఆ తర్వాత అక్కడే ఉండి చదువు పూర్తి చేసి తాను పుట్టి పెరిగిన లండన్‌లోనే సెటిల్ అయిపోయింది అన్షు. అక్కడే ఉన్న బిజినెస్‌మేన్ సచిన్ సగ్గార్‌ను పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ పాప, బాబు ఉన్నారు . ప్ర‌స్తుతం తన తెలివి తేటలతో ఫ్యాషన్ డిజైనర్‌గా అక్కడ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది అన్షు.

ఇన్స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాపుని అన్షు చూసుకుంటుండ‌గా, అందులో బాలీవుడ్ హీరోయిన్లతో పాటు మన హీరోయిన్లు కూడా వేసుకునే దుస్తులకు అక్కడ డూప్లీకేట్ చేసి అమ్మకాలు చేస్తారని తెలుస్తుంది దురు చూస్తున్నారని తెలుస్తోంది. ఇటీవ‌ల త్రివిక్ర‌మ్ -ఎన్టీఆర్ సినిమాకు అన్షుని ఎంపిక చేశార‌నే ప్రచారం జోరుగా జ‌రిగింది. అయితే ఎన్టీఆర్.. త్రివిక్ర‌మ్‌తో కాకుండా కొర‌టాల‌తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే స‌రికి పుకార్ల‌కి పులిస్టాప్ ప‌డ్డాయి.