Manmadhudu 2: రొమాంటిక్ సీన్స్ మా కొంప ముంచేశాయ్

Manmadhudu 2: తెలుగు ఇండస్ట్రీలో కొన్ని ఎవర్ గ్రీన్ సినిమాలు ఉంటాయి. అందులో నాగార్జున నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా అందులో చెప్పుకోవడానికి మన్మధుడు సినిమా ముందు వరుసలో ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకు విజయభాస్కర్ దర్శకుడు. 2002 డిసెంబర్లో విడుదలైన మన్మధుడు అప్పట్లో సంచలన విజయం సాధించింది. నాగార్జున కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించింది.

Manmadhudu 2 Movie Romantic Sccenes Backfired
Manmadhudu 2 Movie Romantic Sccenes Backfired

ఎంటర్టైన్మెంట్ పరంగా ఇప్పటికీ మన్మధుడు అంతే కొత్తగా ఉంటుంది. ఇలాంటి సినిమాకు సీక్వెల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ రాహుల్ రవీంద్రన్ ధైర్యం చేశాడు. చి ల సౌ లాంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తర్వాత మన్మధుడు 2 చేసే అవకాశం రాహుల్ కి ఇచ్చాడు నాగార్జున. ఇది అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది సాహసం చేస్తున్నారు అంటూ విమర్శించారు. అయినా కూడా ధైర్యంగా ముందడుగు వేశారు. మూడేళ్ల కిందట విడుదలైన మన్మధుడు 2 అత్యంత దారుణంగా నిరాశపరిచింది. నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా.

భారీ అంచనాల మధ్య విడుదలైన మన్మధుడు సీక్వెల్ అభిమానులకు కూడా నచ్చలేదు. సినిమా ఇంత దారుణంగా ఎందుకు నిరాశపరిచిందనేది నాగార్జునకు కూడా అర్థం కాలేదు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఫలితం గురించి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఓపెన్ అయ్యాడు. నిజానికి మన్మధుడు 2 మంచి కథ అని.. కాకపోతే దాని ట్రీట్మెంట్ సరిగ్గా లేదని ఒప్పుకున్నాడు.

అన్నింటికిమించి అందులో రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదని తెలిపాడు. సినిమా అంత పెద్ద డిజాస్టర్ కావడానికి ప్రధాన కారణం కూడా ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు సినిమా అంత పెద్ద డిజాస్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకొని కూడా లాభం లేదు అంటున్నారు విశ్లేషకులు.