Mani Sharma: చాలా భయపడ్డాను.. ‘లాహే లాహే’పై మణిశర్మ కామెంట్స్

Mani Sharma మెగాస్టార్ చిరంజీవి మణిశర్మ కాంబినేషన్ అంటే అందరికీ ఓ మాదిరి అంచనాలుంటాయి. అది కూడా దాదాపు ఓ దశాబ్దానికి పైగా గ్యాప్ రావడం, మళ్లీ ఇన్నేళ్ల తరువాత చిరంజీవికి మణిశర్మ బీట్స్ కొడుతుండటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. పాటలు ఎలా ఉంటాయ్.. ఎలాంటి ట్యూన్స్ ఇచ్చి ఉంటారని సందేశాలు ఉంటాయి. ఏ మాత్రం తేడా కొట్టినా కూడా మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అయితే లాహే లాహే అంటూ మొదటి పాటను వదిలారు.

Mani sharma about Acharya Laahe laahe
Mani sharma about Acharya Laahe laahe

చాలా భయపడ్డాను.. ‘లాహే లాహే’ పై మణిశర్మ కామెంట్స్

లాహే లాహే పాట అదిరిపోయింది. అనుకున్న దానికన్న ఎక్కువ ఆదరణ వచ్చిందంటూ మణిశర్మ చెప్పుకొచ్చారు. వేద పండితులు కూడా ఫోన్ చేసి అభినందిస్తున్నారంటూ మణిశర్మ అన్నాడు. అయితే ఈ పాటను విడుదల చేసే ముందు చాలా భయపడ్డానని, మొదటి పాటగా ఏది రిలీజ్ చేయాలని చాలా ఆలోచించానని, కానీ ధైర్యంగా ఓ అడుగు ముందుకు వేసి లాహే లాహేను వదిలామని అన్నాడు. మొత్తానికి ఈ పాట ఓ రేంజ్‌లో క్లిక్ అయినందుకు సంతోషంగా ఉందన్నాడు.

ఈ పాట రాశాక ట్యూన్ చేయడం జరిగింది. ఈ లిరిక్స్ చూసిన వెంటనే ఏదో ఒక వైబ్రేషన్స్ వచ్చాయ్.. వెంటనే ట్యూన్ కట్టేయాలని అనిపించింది. కొరటాల శివకు ఫోన్ చేసి.. ఈ లిరిక్స్ ఏంటండి.. ఏదో అయిపోతోంది.. ఏదో ఉంది ఇందులో అని చెప్పాను. చిరంజీవి గారికి ట్యూన్ చేసి వినిపించాక.. ఆయన కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యారు. దాదాపు 20 నిమిషాలు పాట గురించి మాట్లాడారు. మిగిలిన నాలుగు పాటలు కూడా అదిరిపోతాయని మణిశర్మ అన్నాడు.

Advertisement