Mani ratnam: స్టార్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో హీరోగా అల‌రించ‌బోతున్న సిద్ శ్రీరామ్

Mani ratnam: సింగ‌ర్ సిద్ శ్రీరామ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న‌కు తెలుగు, త‌మిళంతో పాటు ప‌లు భాష‌ల‌లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోమింగ్ ఉంది. అత్యంత తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన సిద్‌ శ్రీరామ్‌.. మెలోడియస్‌ గీతాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. తమిళనాడులో జన్మించి అమెరికాలో పెరిగిన శ్రీరామ్‌ తెలుగులో తనదైన శైలిలో పాటలు పాడుతూ శ్రోతలను మెస్మరైజ్‌ చేస్తున్నాడు.

mani ratnam driecting with a singer
mani ratnam driecting with a singer

‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో మొదలైన సిద్‌ తెలుగు పాటల ప్రస్థానం.. పుష్ప వరకు కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తన అద్భుత గాత్రంతో ఆకట్టుకుంటూ వస్తోన్న సిద్‌ శ్రీరామ్‌ ఇప్పుడు కొత్త అవతారమెత్తనున్నట్లు తెలుస్తోంది. స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో సిద్‌ శ్రీరామ్‌ వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరోగా మారనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడంతో హీరోగా చేయడానికి సిద్‌ శ్రీరామ్‌ కూడా అంగీకరించినట్లు కోలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

mani ratnam driecting with a singer1
mani ratnam driecting with a singer1

సిద్ శ్రీరామ్ ఇటీవ‌లి కాలంలో త‌న పాట‌ల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న పాడిన ప్ర‌తి పాట యూట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూ రికార్డుల‌ని తిర‌గ‌రాస్తుంది. పాటలతో శ్రోతలను కట్టిపడేసిన సిద్‌ ఇకపై హీరోగా మారి డైలాగ్‌లు, ఫైటింగ్‌తో అట్రాక్ట్ చేయనున్నాడని వ‌స్తున్న వార్త‌ల‌లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.