Manchu Vishnu: గెలిచిన త‌ర్వాత ప్ర‌ముఖుల‌ని క‌లుస్తున్న విష్ణు..తొలిసారిగా ఎవరిని క‌లిశారంటే..!

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు అసెంబ్లీ ఎన్నిక‌లని త‌ల‌పించాయి. పట్టుమని 900 మంది కూడా ఈ ఎన్నికల్లో మాట‌ల తూటాలు మాముల‌గా లేవు. ఈ సారి మా అసోసియేషన్ ఎన్నికల్లో కంటికి కనిపించని యుద్ధం జరిగింది. మరీ ముఖ్యంగా మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. దాన్ని కొందరు ధైర్యంగా తెర ముందు కూడా చెప్పారు. చిరంజీవి మెగా కాంపౌండ్ మద్దతుతో పోటీ చేసిన ప్రకాష్ రాజ్.. అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.

Manchu Vishnu to Meet YS Jagan After his Oath as MAA President
Manchu Vishnu to Meet YS Jagan After his Oath as MAA President

మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ పై గెలిచారు. త్వరలో ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 107 ఓట్ల తేడాతో మంచు విష్ణుగెల‌వ‌గా , ఈ విజ‌యం వారిపై పెద్ద బాధ్య‌త‌ను నెత్తిన వేసింది. మ్యానిఫెస్టోలోఇచ్చిన‌వి అన్నీ నెర‌వేర్చాలని ఇప్ప‌టికే ప‌లువురు చెప్పుకొస్తున్నారు.

దసరా రోజు మంచు విష్ణు.. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీ సీఎంను కలిసే అవకాశాలున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలవనున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చిత్ర సీమకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. దాంతో పాటు థియేటర్స్‌ సమస్యను చర్చించే అవకాశం ఉంది.

అయితే తాను గెలిచిన త‌ర్వాత తొలిసారి లెజండ‌రీ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణని క‌లిసారు.ఆయ‌నకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఈ విష‌యాన్నిమంచు విష్ణు త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. న‌న్ను స‌పోర్ట్ చేసిన కైకాల గారిని క‌లిసేందుకు ఆయ‌న ఇంటికి వ‌చ్చాన‌ని విష్ణు స్ప‌ష్టం చేశారు.