Manchu Vishnu: న‌న్ను స‌పోర్ట్ చేసినందుకు కృత‌జ్ఞ‌తలు బాల అన్న: మంచు విష్ణు

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప్ర‌చారం జోరుగా సాగుతుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు మంచు విష్ణు ప్యానల్ కు మధ్య పోటీ రసవత్తరంగా సాగనుంది. అద్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. ఇప్పటికే తమ ప్యానల్ సభ్యులను ప్రకటించారు.

Manchu Vishnu Thanking Bala Krishna For Supporting Him In MAA Elections
Manchu Vishnu Thanking Bala Krishna For Supporting Him In MAA Elections

మా బిల్డింగ్.. మనమంతా ఒక్కటే అనే అస్త్రాలతో ఓట్లు దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రోజు రోజుకీ రకారకాల ట్విస్ట్‏లు చోటు చేసుకుంటూ సాధారణంగా ఎన్నికలను తలపిస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్ధిగా జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ దాఖలు చేసిన నిర్మాత బండ్ల గణేష. అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

Manchu Vishnu Thanking Bala Krishna For Supporting Him In MAA Elections
Manchu Vishnu Thanking Bala Krishna For Supporting Him In MAA Elections

తన మద్దతు పూర్తిగా ప్రకాష్ రాజ్ కే అని ప్రకటించారు బండ్ల.ఇక అధ్య‌క్ష ప‌దవి బ‌రిలో దిగిన సీవీఎల్ న‌రిసింహారావు కూడా అధ్య‌క్ష బ‌రి నుండి త‌ప్పుకున్నారు. అయితే మంచు విష్ణు ప్రచారానికి జోరు పెంచారు. తన ప్యానల్ సభ్యులతో కలిసి ఇటీవల సూపర్ స్టార్ కృష్ణను కలిశారు. మోహన్ బాబుతో పాటు తన ప్యానల్‌తో కృష్ణ ఇంటికి వెళ్లారు మంచు విష్ణు.. కృష్ణ మద్దతు తమకు ఉందని ఇలా తెలియ‌జేశారు.

ఇక తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ‌ని ఆయ‌న క‌లిసారు మంచు విష్ణు. అఖండ షూటింగ్ లో ఉన్న బాల‌కృష్ణ‌ని క‌లిసి ప‌లు ఫొటోలు దిగాడు. వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. బాల అన్న స‌పోర్ట్‌, నాకు మ‌ద్ద‌తుగా నిలిచినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.