Manchu Vishnu: నేను మాట్లాడటం మొదలెడితే ప్రకాష్ రాజ్ బాత్ రూమ్ లోకి వెళ్ళి ఏడవాలి

Manchu Vishnu: టాలీవుడ్ లో ప్రస్తుతం మా ఎలక్షన్ల ప్రచార కార్యక్రమాలు హీట్ ఎక్కిస్తున్నాయి. మా ఎలక్షన్ల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మాటల తూటాలు చాలా వేగంగా ఉన్నాయి. మా ఎన్నికల ప్రచారం నుండి ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ లోకి ఇన్వాల్వ్ అయిపోతున్నాయి. ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మీద చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెబుతున్నారు.

లేటెస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా.. మంచు విష్ణు మాట్లాడుతూ.. తనకు ప్రకాష్ రాజ్ అయినా నేనైనా మా అసోసియేషన్ కు మంచి చేస్తే తాను కూడా యాక్సెప్ట్ చేసేవాడని అన్నారు. కానీ ప్రకాష్ రాజ్ విషయంలో తనకు ఆ నమ్మకం లేదని అన్నారు. మా ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో ఈ ఎన్నికల ప్రచారాలు పర్సనల్ గా వద్దని మా అసోసియేషన్ కోసం చేద్దామని అన్నారు.

అలా అన్నప్పుడు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ తో నేను పర్సనల్ గా మాట్లాడనంటూ చెప్పాడు. కానీ ఆయనే ఫస్ట్ తన గురించి బహిరంగంగా మాట్లాడారని.. తాను కనుక ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడటం మొదలుపెడితే బాత్ రూమ్ లోకి వెళ్ళి షవర్ కింద కూర్చుని మరీ ఏడవాల్సి వస్తుందని అన్నారు. క్రమశిక్షణ కలిగిన ఫ్యామిలీనా అని అంటున్న ప్రకాష్ రాజ్ కే అసలు క్రమశిక్షణ లేదని అన్నారు.

శ్రీనువైట్ల సినిమాలో ప్రకాష్ రాజ్ బిహేవియర్ నచ్చక సినిమాలో నుండి తీసేశారని అన్నారు. ఇండస్ట్రీలో చాలామందికి ప్రకాష్ రాజ్ గురించి తెలుసని అన్నారు. అలాగే ప్రకాష్ రాజ్ కు ఒక వ్యక్తిగా ఎవరూ రెస్పెక్ట్ ఇవ్వరని అన్నారు. అలాగే మంచు విష్ణు అంటే ఏంటో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసని, తన ఫ్యామిలీకి తెలుసని అన్నారు. ఈ ఎన్నికల్లో తనే గెలుస్తానని.. ఎందుకంటే మా అసోసియేషన్ కోసం ఎవరు శ్రమిస్తారనేది అందరికీ తెలుసని అన్నారు.

అలాగే రీసెంట్ గా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ అంత ఉండదు నీ సినిమా బడ్జెట్ అనే వ్యాఖ్యలకు మంచు విష్ణు రెస్పాండ్ అయ్యారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ సూపర్ స్టార్ అవ్వరని.. అలా అని మిగతా వారంతా పనికిరారని అంటారా అంటూ ప్రశ్నించారు. ఇక మా అసోసియేషన్ అనేది ఆర్టిస్టుల కష్టాలను పట్టించుకునే వ్యక్తిత్వం ఉన్న వారికే దక్కాలని అన్నారు.