Manchu Vishnu: మా ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌ను .. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మంచు విష్ణు

Manchu Vishnu: సాధార‌ణ ఎన్నిక‌ల క‌న్నా ర‌స‌వ‌త్త‌రంగా మా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. ఎప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య మాత్రమే జ‌రిగే మా ఎన్నిక‌లు ఈ సారి ఐదుగురి మధ్య జ‌ర‌గ‌నున్నాయి. అధ్య‌క్ష బ‌రిలో ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్‌ నరసింహరావు ఉండ‌గా, వీరు వీలున్న‌ప్పుడ‌ల్లా త‌మ గురించి ప్ర‌మోట్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా మంచు విష్ణు ప్ర‌త్యేక వీడియో విడుద‌ల చేశారు.

Manchu Vishnu

మా బిల్డింగ్‌, సినీ కార్మికుల క‌ష్టాలు, ఎన్నిక‌లు ఏక‌గ్రీవం వంటి గురించి ఆసక్తిర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త 12 ఏళ్లుగా మా బిల్డింగ్ క‌ట్టాల‌ని అంద‌రు అనుకున్నారు. కాని అది జ‌ర‌గ‌డం లేదు. నేను నా కుటుంబం క‌లిసి మా బిల్డింగ్ క‌ట్ట‌డానికి ఇస్తాం. మా భ‌వ‌నం ప్ర‌స్తావ‌న ఇక ప‌క్క‌న పెట్టి సినీకార్మికులు ప‌డే క‌ష్టాన్ని గురించి చర్చిద్దాం అని మంచు విష్ణు అన్నారు. అలానే పెద్ద‌వాళ్లంద‌రు మా ఎన్నిక‌ల‌ను ఏక‌గ్రీవం చేస్తే పోటీ చేయ‌ను. ఏకగ్రీవం కాని పక్షంలో పోటీకి నేను సిద్ధం అంటూ మంచు విష్ణు స్ప‌ష్టం చేశారు.

పూర్వం మద్రాసులో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం నటులకి కలిపి ఒక్క నడిగర్ సంఘం మాత్రమే వుండేది. మన తెలుగు సినీ నటీనటులకి ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ‘తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఏర్పాటు చేశారు. తెలుగు సినీ నటీనటుల కష్టసుఖాలు తెలిసిన తెలుగువారే అధ్యక్షులుగా వుంటూ చాలా మంచి పనులు చేస్తూ ‘తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ని అద్భుతంగా నడిపారు.

ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ హైద్రాబాద్ రావడం, 1993లో ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ని అక్కినేని నాగేశ్వరరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నాన్నగారు, చిరంజీవి గారు మరికొంతమంది పెద్దలు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. నాన్నగారు ‘మా’ పదవిలో ఉన్నా, లేకపోయినా సినీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉన్నారు.

ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను గానీ, నా కుటుంబం గానీ వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులకు ప్రాబ్లమ్స్ వస్తే పోలిస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయడం జరిగింది. 2015లో దాసరి నారాయణ రావు గారు, మురళీ మోహన్ గారు ఇద్దరు కలిసి నన్ను ప్రెసిడెంట్ గా ఉండమని అడిగితే, ఆరోజు నాన్నగారు అడ్డుపడి ఇప్పుడే ఈ వయసులో ఎందుకు అని నన్ను వద్దని గురువు గారికి సర్దిచెప్పారు.

ఇంతకు ముందు ఉన్న మురళీ మోహన్ గారు, నాన్న గారు, నాగబాబు గారు, రాజేంద్రప్రసాద్ గారు, శివాజీ గారు మంచి పనులు చేశారు. ప్రస్తుతం ఉన్న నరేష్ గారైతే క‌రోనా స‌మ‌యంలోను కష్టాల్లో ఉన్న ఎంతో మంది తోటి ఆర్టిస్ట్ లకి అండగా నిలబడి వాళ్ళకి ఇన్సూరెన్స్ లు, పెన్షన్స్ లాంటివే కాకుంటే, తన సొంత డబ్బులు కూడా ఇచ్చి ఎంతోమందికి హెల్ప్ చేశారు. మా మెంబ‌ర్స్ అంద‌రు నిస్వార్ధంగా ప‌ని చేశారు.

మా అసోసియేష‌న్‌లో త‌ప్పులు జ‌రిగి ఉండొచ్చు. అవి ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసి ఉండ‌క‌పోవ‌చ్చు. గ‌తంలో జ‌రిగిన త‌ప్పులు త‌వ్వ‌కుండా ముందుకెళ్లి మంచి ప‌నులు ఎలా చేయోలో ఆలోచిద్ధాం. నా బ్రదర్ సునీల్ నటుడిని ఒక సందర్భంలో కలిసినప్పుడు నాకొక మాట చెప్పాడు. ‘ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా మోహన్ బాబు గారిని కలువు, ఆయన నీకు హెల్ప్ చేస్తారు’ అని తోటి నటీనటులు చెప్పారని, అలానే నాన్న గారిని కలిసానని, సమస్య పరిష్కారం అయ్యిందని చెప్పాడు.

ఇక మన సినీ ఆర్టిస్ట్స్ ఫేస్ చేస్తున్న రియల్ ఇష్యూస్ మీద మనం దృష్టి పెడదాం. ప్రజెంట్ మన మూవీ ఇండస్ట్రీ గోల్డెన్ ఫేజ్ వైపు నడుస్తుంది. ఎన్నో కొత్త కొత్త ఓటీటీలు, సినిమాలు, యూట్యూబ్ ఛానల్స్ అంటూ ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒకచోట పని దొరుకుతుంది. మన ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్‌ లో వాళ్ళ వాళ్ళ యూనియన్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళే సినిమాల్లో పని చేయాలి, కానీ ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్నదేమిటంటే.. మెంబర్షిప్ లేని చాలామంది పనిచేస్తున్నారు. మెంబర్షిప్ ఉన్నవారికి పని లేదు. కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేద్దాం.. తప్పులేదు.. కానీ సినిమాల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరు మా మెంబ‌ర్ కావ‌ల్సిందే.

నేను ఇప్పటికీ నమ్మేది ఒక్కటే.. ఇండస్ట్రీ పెద్దలు అయిన కృష్ణ గారు, కృష్ణం రాజు గారు, సత్యనారాయణ గారు, నాన్న గారు, మురళీమోహన్ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, జయసుధ గారు, రాజశేఖర్ గారు, జీవిత గారు, రాజేంద్రప్రసాద్ గారు, కోట శ్రీనివాస్ గారు, ఇంకా కొంతమంది పెద్దలు కూర్చుని మా కుటుంబాన్ని నడిపించడానికి వాళ్ళే ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకుంటాను. ఏకగ్రీవం కాని పక్షంలో పోటీకి నేను సిద్ధం. పెద్దలను గౌరవిస్తాం.. వాళ్ళ సలహాలు పాటిస్తాం. మా యంగర్ జనరేషన్ ని ఆశీర్వదించి.. మా ప్రెసిడెంట్ గా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ.మంచు విష్ణు అంటూ వీడియో ముగించారు.