Manchu Vishnu: ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం.. ఎప్పుడంటే?

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన సంగతి అందరికీ తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంత రసవత్తరంగా మా ఎన్నికలు జరగగా ప్రకాశ్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ పడి విష్ణు చేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలో ఇటీవల మా ఆఫీసులో ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆనవాయితీ ప్రకారం ప్రమాణ స్వీకారం చేయాల్సింది. అది ఎప్పుడు ఉందంటే..

Manchu Vishnu Oath as MAA President on October 16th
Manchu Vishnu Oath as MAA President on October 16th

‘మా’అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం ఈ నెల 16వ తేదీన ఉదయం 11.45 గంటలకు ఉంటుందని విష్ణు మీడియాకు తెలిపారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు విష్ణు. తన తండ్రి మోహన్ బాబు‌తో కలిసి మంచు విష్ణు తాజాగా నందమూరి నటసింహం బాలయ్యను కలిశారు. ప్రమాణస్వీకారానికి రావాలని ఆయన్ను కోరినట్లు విష్ణు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతీ ఒక్కరిని తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అయితే, ప్రమాణ స్వీకార వేదిక ఎక్కడ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదని, కన్ఫర్మ్ అయ్యాక అందరికీ చెప్తానని అన్నారు.

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులకు కూడా ఆహ్వానం పంపుతున్నట్లు విష్ణు పేర్కొన్నారు. వారి వీలును బట్టి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు వస్తారని అన్నారు. ఇప్పటికే పరచూరి బ్రదర్స్, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, ఇంకా పలువురిని కలిశానని, ఇంకా చాలా మంది తనను సపోర్ట్ చేసిన వారిని కలవబోతున్నట్లు విష్ణు వివరించారు. ఇకపోతే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులను కూడా కలుపుకుని పాజిటివిటీతో ముందుకు సాగాలని తాము భావిస్తున్నట్లు ‘మా’ అధ్యక్షుడు విష్ణు చెప్పారు. ఈ సంగతులు పక్కనబెడితే.. నందమూరి నటసింహం బాలయ్య విష్ణును ముందు నుంచి సపోర్ట్ చేస్తున్నారు.

‘అఖండ’ ఫిల్మ్ షూటింగ్ స్పాట్‌లో ఇంతకు ముందు బాలయ్యను కలిసిన విష్ణు, తాజాగా బాలయ్య ఇంటి వద్ద కలిశారు. మెగాస్టార్ చిరంజీవిని కూడా తండ్రి మోహన్ బాబుతో కలిసి మంంచు విష్ణు కలవబోతున్నట్లు సమాచారం.