Manchu Vishnu: ప్ర‌కాశ్ రాజ్‌పై సెటైర్.. రాత్రి అయితే మా వాళ్లు ప‌బ్‌ల‌కి వెళ్ల‌రు: మంచు విష్ణు

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు అక్టోబర్ 10న జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల త‌న ప్యానెల్ ప్ర‌క‌టించిన మంచు విష్ణు.. తన ప్యానల్‌ సభ్యులతో కలిసి శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ‘మా’ ప్రెసిడెంట్‌ అనేది బిరుదు కాదని, ఒక బాధ్యతాయుతమైనదని మంచు విష్ణు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Manchu Vishnu Indirect Comments On Prakash Raj Panel
Manchu Vishnu Indirect Comments On Prakash Raj Panel

మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘‘మా’లో ఎన్నో సవాళ్లున్నాయి. వాటన్నింటిని సమర్థంగా ఎదుర్కొనే ప్యానల్‌ మాది. ప్రత్యర్థి ప్యానెల్‌లో మంచి నటులున్నారు. కానీ, ‘మా’ అసోసియేషన్‌లో పనిచేసేంత సామర్థ్యం వాళ్లకు లేదు. ఈ విషయంలో నాకన్నా ఎవరూ బాగాపనిచేయలేరు. వాళ్ల గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ‘మా’ ఒక ఛారిటీ ఆర్గనైజేషన్‌ కాదని ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ అంది.

అసోసియేషన్‌లో ఉన్న 900 మందికి లైఫ్‌, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వడమే నా ప్రాధాన్యత. ఎడ్యుకేషన్‌ పాలసీ గురించి ఏమైనా మాట్లాడారా, ఆ ప్యానెల్‌లో ఉన్న ఎవరైనా దీనిపై మాట్లాడటానికి వస్తే నేను సిద్ధం. 900 మంది ఉన్న అసోసియేషన్‌ 2వేల మంది కావాలి, కొత్త వాళ్లను ఇండస్ట్రీలోకి రానివ్వాలి. నిర్మాత దేవుడితో సమానం. వాళ్లను గౌరవించాలి, డిమాండ్‌ చేయకూడదు. నాకు బాబుమోహన్‌, పృథ్వీలాంటి సీనియర్‌ నటుల అనుభవం కావాలి. శివ బాలాజీ లాంటి యువరక్తం మా అభివృద్ధికి అవసరం అన్నారు.

మా ప్యానెల్‌లో పార్టీల‌కు వెళ్లేవారు లేరు.రాత్రి అయితే ప‌బ్‌లు, పార్టీలు అంటూ ఎవ‌రు వెళ్ల‌రు. కేవ‌లం మా అసోసియేష‌న్ కోసం మాత్ర‌మే ప‌ని చేస్తారు. ఈ ఎన్నికలు చాలా ఇబ్బందికరమైనవి. చివరి క్షణం వరకు ఏకగ్రీవం కోసం ప్రయత్నించా’’ అన్నారు. 26 మంది మా ప్యానెల్‌లో పది మంది ఆడవాళ్లున్నారు. మా హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం.. యాభై శాతం మంది ఉంటే ఇంకాస్త హ్యాపీగా ఫీలయ్యేవాడిని. నటులుగా ఆడవాళ్లకు భద్రతను కల్పించాలి.. అది నా ప్రధాన అజెండా. వాళ్లు చెప్పిందాంట్లో 90 శాతం తప్పులే ఉన్నాయి. రెస్టారెంట్‌కు వెళ్తే డిస్కౌంట్ ఏంటి? అన్నపూర్ణమ్మ గారు వెళ్తారా? బాబు మోహన్ గారు వెళ్తారా? పెద్దవాళ్లను మనం చూసుకోవడం బాధ్యత? ఇది చారిటా? అని అన్నారు. ఇన్సూరెన్స్‌లు వద్దని అంటున్నారు. ఇది మన బాధ్యత.