Ginna : చిరంజీవితో పోటీ.! పక్కకు తప్పుకున్న మంచు విష్ణు.!

NQ Staff - September 26, 2022 / 08:55 AM IST

Ginna : చిరంజీవితో పోటీ.! పక్కకు తప్పుకున్న మంచు విష్ణు.!

Ginna : మెగాస్టార్ చిరంజీవితో ‘ఢీ అంటే ఢీ’ అన్నట్లుగా బాక్సాఫీస్ వద్ద మంచు విష్ణు తలపడబోతున్నాడంటూ గతంలో ప్రచారం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ.? మంచు విష్ణు ఎక్కడ.? అంటూ డిస్కషన్స్ కూడా నడిచాయ్. అక్టోబర్ 5వ తేదీన ‘గాడ్ ఫాదర్’ సినిమాకి పోటీగా ‘జిన్నా’ సినిమాని విడుదల చేయాలని మంచు విష్ణు ప్లాన్ చేసిన మాట వాస్తవమే.

కానీ, చివరి నిమిషంలో మంచు విష్ణు వెనక్కి తగ్గాడు. తాజాగా అందుతోన్న సమాచారాన్ని బట్టి, ‘జిన్నా’ సినిమాని వెనక్కి పంపించారనీ, అక్టోబర్ 21న విడుదలయ్యే అవకాశం వుందనీ తెలుస్తోంది. ‘గాడ్ ఫాదర్’కి భయపడిన ‘జిన్నా’.? ‘గాడ్ ఫాదర్’కి ‘జిన్నా’ భయపడలేదు.. ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదని మంచు విష్ణు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లేస్తున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే, ‘జిన్నా’ సినిమా ఈ అక్టోబర్ 21న విడుదల కావడం కూడా అనుమానమేనన్న వాదన ఇంకోటి వినిపిస్తోంది.
‘జిన్నా’ సినిమాలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ కథానాయికలుగా నటించిన విషయం విదితమే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us