Manchu Vishnu: ‘మా’ లో మహిళల కోసం మంచు విష్ణు కీలక నిర్ణయం

Manchu Vishnu: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్న మంచు విష్ణు తన మేనిఫెస్టోను అమలు చేస్తున్నారు. రోజుకో సరికొత్త నిర్ణయంతో మా అసోసియేషన్ అధ్యక్ష పదవి బాధ్యతల్ని నెరవేరుస్తున్నారు. లేటెస్ట్ గా మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. మా అసోసియేషన్ లో మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

TheNewsQube-
Manchu Vishnu Decision for Women in Maa Association
Manchu Vishnu Decision for Women in Maa Association

ఈ గ్రీవెన్స్ సెల్ కు గౌరవ సలహాదారుగా ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన సునీతా కృష్ణన్ వ్యవహరిస్తారని అన్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విట్టర్ అకౌంట్ లో అధికారికంగా ప్రకటించారు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారని అన్నారు.

వారిలో ఎవరెవరు ఉంటారనేది త్వరలోనే చెప్తానని మంచు విష్ణు అన్నారు. ఇక మా లో మరింతమంది మహిళల్ని భాగస్వాముల్ని చేయడానికి ఈ కమిటీతో కలిసి తొలి అడుగు వేస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా మహిళల హక్కుల్ని కాపాడుతూ వారిని గౌరవించడమే ఈ ఉమెన్ ఎంపవర్ మెంట్ గ్రీవెన్స్ సెల్ ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు.

మా అసోసియేషన్ ఫ్యామిలీకి రక్షణ కల్పించడంలో తాము తీసుకున్న నిర్ణయానికి గర్విస్తున్నామని మంచు విష్ణు పేర్కొన్నారు. మా అసోసియేషన్ అధ్యక్ష పదవిని స్వీకరించిన మంచు విష్ణు తన ప్యానల్ మెంబర్స్ వివరాల్ని తెలియజేశారు.