Ramcharan : మనోజ్ కు దగ్గరవుతున్న రామ్ చరణ్.. విష్ణును పక్కన పెడుతున్నారా..?
NQ Staff - April 10, 2023 / 11:00 AM IST

Ramcharan : మంచు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి చాలా కాలంగా అస్సలు పడట్లేదు. ముఖ్యంగా మా అసోసియేషన్ ఎన్నికల సమయం నుంచే ఇరు ఫ్యామిలీల నడుమ గ్యాప్ బాగా పెరిగిపోయింది. అప్పటి నుంచి మంచు విష్ణు, మనోజ్ మధ్య అస్సలు సఖ్యత లేకుండా పోయింది. అప్పటి నుంచే ఒకరికి ఒకరు అస్సలు పడట్లేదు.
తమ ఫ్యామిలీపై ట్రోల్స్ చేయిస్తున్నారంటూ మంచు విష్ణు స్వయంగా చెప్పడం కూడా సంచలనం రేపింది. అయితే తాజాగా రామ్ చరణ్ చేసిన పని అందరికీ షాక్ ఇచ్చింది. రీసెంట్ గానే మనోజ్-మౌనిక పెండ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జంటకు రామ్ చరణ్ ఓ స్పెషల్ గిఫ్ట్ పంపించాడు.
రామ్ చరణ్-ఉపాసన కలిసి ఓ ఖరీదైన బహుమతిని మనోజ్-మౌనికకు పంపించారు. అది చూసిన మనోజ్ చాలా ఆశ్చర్యపోయాడు. మీకు నా స్పెషల్ థాంక్స్. మీరు వెకేషన్ నుంచి వచ్చిన వెంటనే మనం కలుద్దాం అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశాడు. అయితే రామ్ చరణ్ మీద నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
కేవలం మంచు మనోజ్ ను మాత్రమే దగ్గరకు తీసుకుని మంచు విష్ణును రామ్ చరణ్ పక్కన పెట్టేయాలని డిసైడ్ అయ్యాడంటూ చెబుతున్నారు. మొదటి నుంచి రామ్ చరణ్ కేవలం మనోజ్ ను మాత్రమే దగ్గరకు తీసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా మంచు విష్ణును పక్కన పెట్టేస్తున్నాడంటూ చెప్పుకొస్తున్నారు.