Maa Elections: క్యా సీన్ హై.. ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు ఇలా ఒక్క‌ట‌య్యారు..!

Maa Elections: మా ఎన్నిక‌ల నేప‌థ్యంలో గత కొద్ది రోజులుగా ప్ర‌కాశ్ రాజ్ , మంచు విష్ణు మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకుంటూ వార్త‌ల‌లోకి ఎక్కారు. ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌కి చెందిన నాగ‌బాబు మంచు విష్ణుని టార్గెట్ చేస్తూ దారుణ‌మైన కామెంట్స్ చేశారు.దీనిపై గ‌ట్టిగా స్పందించారు మంచు విష్ణు.

Manchu Vishnu And Prakash Raj Hug Each Other During Maa Elections
Manchu Vishnu And Prakash Raj Hug Each Other During Maa Elections

అయితే మా ఎన్నికలు జరుగుతోన్న జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌కు సినీ తారలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అధ్యక్ష పదవిలో ఉన్న మంచు విష్ణు ఉదయాన్నే చేరుకోగా. కాసేపటి క్రితమే ప్రకాశ్‌ రాజ్‌ కూడా వచ్చారు. వచ్చి రాగానే మంచు విష్ణును ఆలింగనం చేసుకున్నారు. ఇక అక్కడే ఉన్న మోహన్‌ బాబును చూడగానే కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించాడు అయితే మోహన్‌ బాబు దానికి నిరాకరించి ప్రకాశ్‌ రాజ్‌ను భుజం తట్టాడు. ఈ సీన్ చూసి క్యా సీన్ హై అంటున్నారు.

దివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్‌ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలు ఎన్నికల కేంద్రం వద్ద మోహరించారు. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జరగనున్న ఎన్నికల కోసం మూడు గదులను కేటాయించి ఒక్కో గదిలో నాలుగు పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్‌ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది ఓటు​ హక్కును వినియోగించుకోనున్నారు. రాత్రి 8 గంట‌ల త‌ర్వాత రిజ‌ల్ట్ రానుంది.