Manchu Manoj : వారికి ఆదిపురుష్ మూవీ ఫ్రీగా చూపిస్తా.. మంచు మనోజ్ గొప్ప మనసు..!

NQ Staff - June 13, 2023 / 09:26 AM IST

Manchu Manoj : వారికి ఆదిపురుష్ మూవీ ఫ్రీగా చూపిస్తా.. మంచు మనోజ్ గొప్ప మనసు..!

Manchu Manoj  : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలిసారి రాముడిగా నటిస్తున్న మూవీ ఆదిపురుష్‌. రామాయణం ఆధారంగా ఓం రౌత్ దీన్ని తెరకెక్కించారు. ఇందులో సీతగా కృతిసనన్ నటించింది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 16 మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే జోరుగా ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు.

అయితే ఇంత గొప్ప సినిమాను అందరికీ చూపించాలనే ఉద్దేశంతో చాలామంది మూవీ టికెట్లను కొనుగోలు చేసి నిరుపేదలు, అనాథ శరణాలయంలోని పిల్లలకు చూపిస్తున్నారు. ఇప్పటికే రణ్‌ బీర్ కపూర్ 10వేల టికెట్లను కొనుగోలు చేశారు. వాటిని వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు ఇవ్వనున్నట్టు తెలిపారు.

అలాగే నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా 10 వేలకిపైగా టికెట్లను కొనుగోలు చేశారు. ప్రముఖ సింగర్ అనన్య బిర్లా 10 వేల టికెట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా తెలుగు హీరో మంచు మనోజ్ కూడా ముందుకు వచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లోని అనాథ శరణాలయాలలో ఉండే విద్యార్థులకు 2500 టికెట్లు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు.

Manchu Manoj Will Show Movie Adipurush For Free Students Of Orphanage

Manchu Manoj Will Show Movie Adipurush For Free Students Of Orphanage

బృహస్పతి టెక్‌, నమస్తే వరల్డ్‌తో కలిసి ఇంత గొప్ప కార్యక్రమం చేపడుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు ట్విట్టర్ ద్వారా తెలిపాడు మంచు మనోజ్. ఇందుకు సంబంధించి ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. మనోజ్-మౌనిక దంపతులు కలిసి చేపడుతున్న ఇంత గొప్ప క్యారక్రమాన్ని అందరూ అభినందిస్తున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us