Manchu Manoj: చిన్నారి హ‌త్యాచారం.. కుటుంబ స‌భ్యుల‌ని ప‌రామ‌ర్శించిన మ‌నోజ్

Manchu Manoj: హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఓ కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో క‌లిచి వేసింది. అయితే ఘ‌ట‌న జ‌రిగి చాలా రోజులే అవుతున్నా నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయ‌లేదు. 10 పోలీస్ స్పెషల్ టీమ్స్ నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు,మంత్రి కేటీఆర్ మాత్రం ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారంటూ రెండు రోజుల క్రితం ట్వీట్ చేయడం గమనార్హం.

Manchu Manoj Visits Victims Family in Singareni Colony
Manchu Manoj Visits Victims Family in Singareni Colony

నిందితుడి అరెస్ట్‌పై గంద‌ర‌గోళం నెల‌కొన్న నేపథ్యంలో తాజాగా మంచు మ‌నోజ్ చిన్నారి కుటుంబ స‌భ్యుల‌ని ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఆయ‌న పసిపాపపై జరిగిన కౄరత్వంపై వాళ్ల తల్లిదండ్రులతో ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ తల్లి కాళ్ల మీద పడి ఏడుస్తుంటే నిస్సహాయంగా అనిపించింది. చేతకానివాడిలా అనిపించింది.

వ్యవస్థలో ఈ లోపం క్రియేట్ చేసినందుకు మనందరం బాధ్యత తీసుకోవాలి.ఆడపిల్లలు,మహిళలను ఎలా గౌరవించాలనేది పిల్లలకు ఎప్పుడూ నేర్పిస్తూ ఉండాలి.ఆరు రోజులైంది ఇంకా ఆ రాక్షసుడి ఆచూకీ దొరకలేదు. పోలీసులంతా బాగా కష్టపడుతున్నారు… వెతుకుతున్నారని విన్నాను.సీఐతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నాను.ప్రతీ ఒక్కరూ దీన్ని కొంచెం సీరియస్‌గా తీసుకోవాలి.

ఛత్తీస్‌గఢ్‌లో గతేడాది జరిగిన రేప్ కేసుకు ఇప్పుడు ఉరిశిక్ష పడింది.కానీ సంవత్సరం కాదు… ఇలాంటి కేసుల్లో తక్షణం 24గంటల్లో శిక్ష పడేలా చేయాలి.’ మంచు మనోజ్ పేర్కొన్నారు. ప్రతీ సోషల్ మీడియా,మీడియా చానెళ్లు ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకుని నిందితుడి కోసం జల్లెడ పట్టండి.వెతికి అతన్ని దగ్గరున్న పోలీస్ స్టేషన్‌కు అప్పజెప్పండి. ఇది నా రిక్వెస్ట్ అన్నారు.

ఇక టీవీ చానెల్ ఆన్ చేస్తే సాయి ధరమ్ తేజ్ అలా పడ్డాడు… ఇలా పడ్డాడని 3డీ చేసి మరీ చూపిస్తున్నారు.ఇలాంటివి ఎప్పుడు చూపిస్తారు.దీన్ని హైలైట్ చేయండి.వాడి ఫోటో విడుదల చేసి అరెస్టయ్యేలా చూడండి. సారీ అన్నా… మీకు జరిగిన అన్యాయం తీర్చలేని లోటు… న్యాయం జరుగుతుంది అందరూ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలన్నదే బాధిత కుటుంబం డిమాండ్ అని అక్కడున్నవారు చెప్పగా… ఆ మేరకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు మనోజ్ పేర్కొన్నారు.