Manchu Manoj : మంచు మనోజ్ పెళ్లి హడావుడి.. ప్రతి దిష్టి కళ్లు గుడ్డివి అవ్వాలి
NQ Staff - March 1, 2023 / 05:20 PM IST

Manchu Manoj : మంచు మనోజ్ రెండవ పెళ్లికి సిద్ధం అయిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా భూమా మౌనిక రెడ్డితో మంచి మనోజ్ వివాహం జరగబోతోంది అంటూ ప్రచారం జరిగింది. ఎట్టకేలకు మార్చి మూడో తారీఖున వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు.
ఇద్దరికీ కూడా రెండవ పెళ్లి అయినప్పటికీ వైభవంగానే వివాహ వేడుకను జరుపుతున్నారు. పెళ్లి ముందస్తు వేడుకల్లో భాగంగా నేడు సంగీత్ కార్యక్రమం జరిగింది. సంగీత్ కార్యక్రమంలో మంచు మనోజ్ ధరించిన షర్ట్ పై ప్రతి ఒక్క దిష్టి కళ్ళు కూడా గుడ్డివి అయిపోవాలి అంటూ ఉంది.
మనోజ్ మరియు మౌనిక రెడ్డి ఇద్దరు కూడా పెళ్లికి సిద్ధం నేపథ్యంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వాటన్నింటికీ మంచు మనోజ్ ఇదే సమాధానం అన్నట్లుగా దిష్టి కళ్లు అన్నీ కూడా గుడ్డివి అయ్యిపోవాలని సరదాగా తన షర్ట్ పై ఉన్న కామెంట్ తో సమాధానం ఇచ్చాడు.

Manchu Manoj Shared Photos On Social Media
పెళ్లి తర్వాత మంచు మనోజ్ సినిమాలతో బిజీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆమధ్య అహం బ్రహ్మాస్మి అనే సినిమాను మొదలు పెట్టిన మంచు మనోజ్ పెళ్లి తర్వాత దాన్ని పూర్తి చేస్తాడేమో చూడాలి. మొదటి భార్య తో వైవాహిక బంధంలో ఒడిదుడుకుల కారణంగా చాలా సంవత్సరాల నుండి మంచి మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత హీరోగా వరుస సినిమాలు చేస్తాడేమో చూడాలి.