Pawan Kalyan: పవర్‌స్టార్‌తో మంచు మనోజ్ మీటింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాన్‌ను మంచు మనోజ్ హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం కలిశారు. వీరిద్దరి భేటీకి భీమ్లా నాయక్ షూటింగ్ ప్లస్ వేదిక అయింది. ప్రస్తుతం మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల విషయం టాలీవుడ్ వ్యాప్తంగా చర్చంచశనీయంగా మారింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, మంచు మనోజ్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో చోటుచేసుకున్న పరిణామాలు, తాజా చిత్రాల విషయమై ప్రస్తావించినట్టు సమాచారం.

Pawan Kalyan

ఇదిలా ఉండగా.. రీసెంట్‌గా మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికల అనేక పరిణామాలకు దారితీశారు. ఓ వైపు విష్ణు ప్యానెల్‌కు సీనియర్ నటులు బాలకృష్ణ, కృష్ణం‌రాజు, ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్ సపోర్ట్ ఇచ్చారు. మరో వైపు ప్రకాశ్ రాజు ప్యానల్‌కు మెగా ఫ్యామిలీ మద్దతు తెలిపింది. గతంలో ఎన్నడూ లేనంతగా మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

ఈ క్రమంలో ఒకరి ప్యానల్ గురించి మరొకరు దురుసుగా మాట్లాడటంతో వివాదాలు తలెత్తాయి. దాదాపు ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. అందరూ ‘మా’ కుటుంబ సభ్యులు అనుకుంటూనే.. ప్రత్యర్థి అభ్యర్థులపై దూషణలకు దిగారు. దీంతో ఇరు వర్గాల ప్యానల్ సభ్యులపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల్లో చివరకు మంచు విష్ణు ప్యానల్ విజయం సాధించింది. దీంతో ప్రకాశ్ రాజ్ ప్యానల్ పలు ఆరోపణలు చేసింది. మోహన్ బాబు తమపై దాడికి యత్నించారని, అన్ పార్లమెంటరీ ల్యాంగ్వేజ్‌తో తిట్టాడని ఆరోపించారు.

Pawan Kalyan

ఇలా ఎన్నికల సమయంలో రెండు వేర్వేరు ప్యానెల్‌లకు మద్దతు తెలిపిన కుటుంబాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఇలా భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి వీరిద్దరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్న విషయంపై ఇరువురి ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్‌లో సైతం ఆసక్తి నెలకొంది. వీరి భేటీ తర్వాత టాలీవుడ్‌లోని ప్రస్తుత పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి. ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ బిజీబిజీగా ఉంటూ మరో పక్క ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు.