MANCHU LAKSHMI: మంచు ల‌క్ష్మీని ఫుల్‌గా ట్రోల్ చేసిన నెటిజ‌న్స్ .. స్పందించిన విల‌క్షణ‌ న‌టి

కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసిన కేటీఆర్ .. స్వల్పలక్షణాలతో నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వాళ్లు దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి’ అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేటీఆర్‌కు కరోనా రావ‌డంతో పార్టీ కార్యకర్తలతో పాటు, అయన అభిమానులు, మిత్రులు సోషల్‌మీడియాలో ఆయన కోలుకోవాలి అంటూ పోస్ట్‌లు, ట్వీట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో నటి మంచు లక్ష్మీ .. ‘మిత్రమా కేటీఆర్ నువ్వు త్వరగా కోలుకోవాలి. ఈలోపు నా సినిమాలు అన్ని చూసేయ్’ అంటూ మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది. దీనికి కేటీఆర్ కూడా స‌ర‌దాగా స్పందించారు.

నెటిజ‌న్స్ మాత్రం మంచు ల‌క్ష్మీని ఓ ఆట ఆడుకున్నారు. ఆయ‌న అనారోగ్యంతో ఉంటే సినిమాలు చూడ‌మంటారా, మీ సినిమాలు చూస్తే ఐసీయూలోకి వెళ్ల‌డమే వంటి కామెంట్స్ చేశారు. అయితే త‌న‌పై వ‌చ్చిన సెటైరిక‌ల్ కామెంట్స్‌పై మంచు ల‌క్ష్మీ స్పందించింది. ట్రోలింగ్ చేసే వాళ్ల‌ను నేను ఏ మాత్రం ప‌ట్టించుకోను అని కామెంట్ పెట్టింది. మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement