హాలోవీన్ వేడుకలో మంచు ఫ్యామిలీ.. దెయ్యాల గెటప్‌లో లక్ష్మీ పిల్లలు
Samsthi 2210 - October 31, 2020 / 09:04 PM IST

అన్ని పండుగలలో కన్నా హాలీవీన్ పండుగ చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా మనం పండుగలకు కొత్త దుస్తులు ధరించి దేవుడిని ఆరాధిస్తారు. కాని హాలోవీన్ ఇందుకు భిన్నం. ఈ పండుగ రోజున సామాన్యులు, సెలబ్రిటీలు దెయ్యాలు, రాక్షసుల గెటప్స్‌లోకి మారి ఇతరులని భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ప్రతి ఏడాది అక్టోబర్ 31న జరిగే ఈ పండుగ యూరప్ వ్యాప్తంగా విస్తరించింది. ఆ తర్వాత 19వ శతాబ్ధంలో అమెరికాకు వ్యాపించింది. ముఖ్యంగా క్రైస్తవులు ఈ పండుగ జరుపుకునేందుకు ఎక్కవగా చూపించారు. రాను రాను ఈ పండు అన్ని దేశాలకు పాకింది. సెలబ్రిటీలు కూడా దెయ్యాల గెటప్‌లో మారి తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
హాలోవీన్ రోజు దెయ్యాల గెటప్‌లోకి మారడానికి కారణం ఆ రోజు ఆత్మలు భూమిపైకి వస్తాయట. రాక్షసుల గెటప్‌లో ఉన్న మనుషులని చూసి దెయ్యాలు వాళ్ళు కూడా ఆత్మలే అని వెళ్ళిపోతాయట. ఇక గుమ్మడికాయల్లో దీపాలు పెట్టి ఇంటి పరిసరాలలో పెడితే కూడా ఆత్మలు రావని కొందరి విశ్వాసం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కుల, మతం బేదాలు లేకుండా హాలోవీన్ 2020 వేడుకలు అంతా జరుపుకుంటున్నారు. తెలుగువారు కూడా ఈ పండగుని జరుపుకోవడంలో ఆసక్తి చూపించడం విశేషం
మంచు వారమ్మాయి మంచు లక్ష్మీ తన పిల్లలతో కలిసి హాలోవీన్ వేడుకలని జరుపుకుంది. పిల్లలని దెయ్యాల గెటప్‌లోకి మార్చి వారి ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఈ ఏడాది హాలోవీన్ అందంగా, భయంకరంగా ఉంది. అందుకు కారణం ఈ చిన్నారులు మిమ్మల్ని ఆనందపరుస్తారు అనే కామెంట్ పెట్టింది . గతంలో నిహారిక, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌తో పాటు పలువురు తెలుగు సినీ స్టార్స్ కూడా హాలీవీన్ గెటప్‌లోకి మారి తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి.