Manchu Lakshmi: మంచు లక్ష్మీ రచ్చకు నెటిజన్స్ మైండ్ బ్లాక్.. !
Samsthi 2210 - January 21, 2021 / 10:52 AM IST

Manchu Lakshmi మోహన్ బాబు తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ నటిగా, వ్యాఖ్యాతగా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. అనగనగా ఓ ధీరుడు చిత్రంలో ఐరేంద్రి పాత్రలో నటించిన మంచు వారమ్మాయి తన పాత్రతో విమర్శకుల మనసులు దోచుకుంది. కెరీర్‌లో దాదాపు 20 సినిమాలు చేసిన లక్ష్మీ పెద్ద హిట్ మాత్రం కొట్టలేకపోయింది. అయితే ప్రస్తుతం టాక్ షోస్‌కు, సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తన కూతురితోనో లేదంటే తండ్రితోనో ఫన్ చేస్తూ వాటికి సంబంధించి వీడియోలను అంతర్జాలంలో షేర్ చేస్తూ నెటిజన్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది.
మాల్దీవులలో మంచు వారమ్మాయి అందాల ఆరబోత :Manchu Lakshmi
లాక్‌డౌన్ సమయంలో లక్ష్మీ మంచు పలువురు నెటిజన్స్‌ను ఆన్‌లైన్ ఇంటర్వ్యూ చేసి అలరించిన సంగతి తెలిసిందే. బెడ్ రూం సీక్రెట్స్ కూడా కొన్ని రాబట్టే ప్రయత్నం చేసింది. అయితే కరోనా వలన కొద్ది నెలలుగా ఇంటికే పరిమితమై ఉండడం వలన కాస్త రిలాక్సేషన్ కోసం మంచు లక్ష్మీ అండ్ ఫ్యామిలీ మాల్దీవులు టూర్ వేశారు. తన పిల్లలు, భర్త, తండ్రి మోహన్ బాబుతో మాల్దీవులకు చెక్కేయగా, అక్కడి అందాలను తన కెమెరాలో బంధించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. భూతల స్వర్గంలా ఉన్న ఈ ప్రాంతం, నీరు, ఆకాశం, ఇసుకు ప్రతి ఒక్కటి నా మనస్సుకు హత్తుకుంటున్నాయి అంటూ క్యాప్షన్ పెట్టింది.
మంచు లక్ష్మీ షేర్ చేసిన ఫొటోలలో కొన్ని ఫొటోలు నెటిజన్స్‌కు అసహ్యం తెప్పిస్తున్నాయి. నాలుగు పదుల వయస్సులో ఇలాంటి వికృత చేష్టలు అవసరమా అంటూ కొందరు నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తన తండ్రిలాగానే చాలా స్ట్రైట్ ఫార్వార్డ్ వ్యక్తిత్వం అలవరచుకున్న మంచు లక్ష్మీ ఎవరు ఏమనుకున్నా కూడా తను అనుకున్నది మాత్రమే చేసి తీరుతుంటుంది. ప్రస్తుతం పలు కథలను వింటున్న ఈ మంచు వారమ్మాయి రానున్న రోజులలో ఓ సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తుంది.
At the tropical paradise!! ? Super excited to be here and enjoy the blue skies, white beach and the turquoise sea.. This place is literally heaven on earth ???????
VACAY MODE ?@luxsouthari #Maldives pic.twitter.com/GMmKxOx31b— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 20, 2021