Manchu Lakshmi: స్లిమ్‌గా ఉండేందుకు మంచు ల‌క్ష్మీ ఎంత క‌ష్ట‌ప‌డుతుందో చూడండి..!

Manchu Lakshmi: అందాల క‌థానాయిలు ఇప్పుడు ఎంత స్లిమ్‌గా ఉంటే అంత అందంగా ఉన్న‌ట్టు ఫీల‌వుతున్నారు. జీరో సైజ్ కోసం వారు ఫుడ్ విష‌యంలో ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ నిత్యం వ‌ర్క‌వుట్స్ చేస్తూ ఉన్నారు. లావుగా ఉండ‌డంతో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో రాశీ ఖ‌న్నా, కీర్తి సురేష్‌, మెహ్రీన్ వంటి వారు ఇప్పుడు స్లిమ్ లుక్‌లోకి మారి స‌ర్‌ప్రైజ్ చేస్తున్నారు. అయితే కొంద‌రు భామ‌లు ఫిట్‌నెస్‌ని అలానే మెయింటైన్ చేస్తున్నారు.

Manchu Lakshmi LATEST H0T Workout Video
Manchu Lakshmi LATEST H0T Workout Video

తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె అంత సక్సెస్ కాలేకపోయింది. బుల్లితెరలో కూడా పలు షోలలో హోస్టింగ్ చేసింది. ప్రస్తుతం ఆహా లో ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రామ్ కూడా చేస్తుంది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా మారింది. తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.


ఈ క్ర‌మంలో మంచు ల‌క్ష్మీ వ‌ర్క‌వుట్స్‌కి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇందులో మంచు ల‌క్ష్మీ ఎంత‌గా క‌ష్ట‌ప‌డుతుందో అర్ధ‌మ‌వుతుంది. ఈ వ‌య‌స్సులో మంచు ల‌క్ష్మీఇలా స్లామ్‌గా ఉండ‌డానికి కార‌ణంఇదా అని నెటిజ‌న్స్ ముచ్చ‌టించుకున్నారు. అయితే మంచు లక్ష్మీ గ్లామర్‌ విషయంలో ఆచి తూచి వ్యవహరించేంది. యంగ్‌ ఏజ్‌లో అస్సలు గ్లామర్‌ అనే మాటకే దూరంగా ఉండేది. తనదైన స్టయిల్‌లో విభిన్న కథా నేపథ్యం కలిగిన చిత్రాలు చేసింది.


ఇటీవల మాత్రం క్రియేటివ్‌ సైడ్‌కంటే గ్లామర్‌ సైడ్‌ ఎక్కువగా ఫోకస్‌ పెట్టింది. వరుసగా గ్లామర్‌ ఫోటో షూట్లతో అభిమానులకు షాకిస్తుంది. మంచు లక్ష్మీలో ఇలాంటి యాంగిల్‌ కూడా ఉందా అని ఆశ్చర్యపోయేలా ఫోటోలకు పోజులిస్తుంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలపై కొంద‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తుంటే మ‌రి కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.