Kohli Daughter : కోహ్లీ కూతురిని రేప్ చేస్తాన‌న్న వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నాడ‌ట‌..!

Kohli Daughter : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూతురి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ వాసిని పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి అనంతరం జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లి కుమార్తెపై రామ్‌నగేశ్‌ అలిబత్తిని (23) అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.

TheNewsQube-
Man who warned kohli daughter want to suicide
Man who warned kohli daughter want to suicide

ఈ క్ర‌మంలో ముంబయి ప్రత్యేక విభాగం పోలీసులు హైదరాబాద్‌కు చేరుకొని రామ్‌నగేశ్‌ అలిబత్తిని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాడని.. గతంలో ఫుడ్‌ డెలివరీ యాప్‌లో పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు.

Man who warned kohli daughter want to suicide
Man who warned kohli daughter want to suicide

నిందితుడు వ్యాఖ్య‌ల‌ను సుమోటోగా తీసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) కు నోటీసు జారీ చేసింది. ఇది చాలా తీవ్రమైన విషయమని తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొనడంతో పోలీసులు రంగంలోకి దిగి రామ్నగేశ్ అలిబత్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

ఈ విషయాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న ముంబైలోని వెస్ట్ రీజియన్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా నగేశ్ ఫోన్ ను పరిశీలించిన పోలీసులు అతడు ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు గుర్తించారు. దీనికోసం గూగుల్ లో వివిధ విధానాలను పరిశీలించాడు.

అయితే తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ కారణంగా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నాడని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. నగేశ్ వ్యాఖ్యలపై కేసు నమోదైన తర్వాత అనేకమంది అతడి ట్విట్టర్ నుంచి అన్ ఫాలో అయ్యారు. అప్పటివరకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వాళ్లు కూడా హఠాత్తుగా తప్పుకున్నారని వివరించారు. ప్రస్తుతం ముంబై చేరుకున్న రాంనగేశ్ తండ్రి అతడి బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.