Shahrukh khan: షారూఖ్ ఇంటికి బాంబు బెదిరింపు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Shahrukh khan: ఈ మ‌ధ్య సెల‌బ్రిటీల ఇళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువ‌య్యాయి. ర‌జ‌నీకాంత్‌, విజ‌య్, సూర్య వంటి సెల‌బ్స్ ఇంటికి ఎక్కువ‌గా ఇలాంటి బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. తాజాగా షారూఖ్ ఖాన్ ఇంటికి బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. మన్నత్ ను బాంబుతో పేల్చివేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Shahrukh khanjpg
Shahrukh khanjpg

2022 జనవరి 6న జితేష్ మహారాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి, షారూఖ్ బంగ్లాను బాంబుతో పేల్చివేస్తానని చెప్పాడు. ఇందులో షారుక్ బంగ్లాతో పాటు ముంబైలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లు చేస్తామని బెదిరించాడు. ముంబై పోలీసులు కాల్‌ను ట్రేస్ చేసి, ఆ నంబర్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుండి వచ్చిందని కనుగొన్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

నిందితుడు మద్యానికి బానిసైనాడని, గతంలో కూడా ఫేక్ కాల్స్ చేసి పోలీసు ఎస్‌ఓఎస్ సర్వీస్ డయల్ 100 ఉద్యోగులతో గొడవ పడ్డాడని తెలుస్తోంది. ఈ ఫేక్ కాల్ తర్వాత చాలా చోట్ల సోదాలు జరిగాయి. అయితే నిందితుడిని అరెస్టు చేసినప్పటికీ అనుమానాస్పదంగా ఏమీ కన్పించలేదట పోలీసులకు. దీంతో షారుఖ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే బాలీవుడ్ హీరోలకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదేమీ కొత్తకాదు. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ఫేక్ బెదిరింపులు వచ్చాయి. మరోవైపు షారుక్ ఖాన్ తన నెక్స్ట్ మూవీని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. దీపికా పదుకొణెతో కలిసి ‘పఠాన్’లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు.

Shahrukh khan1
Shahrukh khan1

పఠాన్ త‌ర్వాత షారూఖ్ ఖాన్ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీతో క‌లిసి ఓ ప్రాజెక్ట్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.