Adipurush : ఎన్టీయార్‌ని చూసి నేర్చుకో: ‘ఆదిపురుష్’లో రావణుడి పాత్రపై ‘కేజీఎఫ్’ నటి మాళవిక సంచలన వ్యాఖ్యలు.!

NQ Staff - October 4, 2022 / 07:49 PM IST

Adipurush : ఎన్టీయార్‌ని చూసి నేర్చుకో: ‘ఆదిపురుష్’లో రావణుడి పాత్రపై ‘కేజీఎఫ్’ నటి మాళవిక సంచలన వ్యాఖ్యలు.!

Adipurush : ‘కేజీఎఫ్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన మాళవిక అవినాష్, ‘ఆదిపురుష్’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కేవలం సినీ నటి మాత్రమే కాదు, బీజేపీ అధికార ప్రతినిథి కూడా.

కన్నడ సినీ నటి మాళవిక అవినాష్, ‘కేజీఎఫ్’ సినిమాలో పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె తాజాగా ‘ఆదిపురుష్’ సినిమాలోని రావణుడి పాత్రపై మండిపడ్డారు. రామాయణాన్ని దర్శకుడు ఓం రౌత్ వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారామె.

స్వర్గీయ ఎన్టీయార్‌ని చూసి నేర్చుకో..

రావణుడు ఎలా వుంటాడో స్వర్గీయ నందమూరి తారకరామారావు నటించిన సినిమాలు చూసి తెలుసుకోవాలని మాళవిక అవినాష్, ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్‌కి సూచించారు. రావణుడి పాత్రకి నీలి కళ్ళు, లెదర్ జాకెట్ ఆపదించడమంటే రామాయణాన్ని వక్రీకరించడమేనని అన్నారామె.

నిజమే, తెలుగు తెరపై రాముడైనా, రావణుడైనా, శ్రీకృష్ణుడైనాసరే.. స్వర్గీయ నందమూరి తారకరామారావుకి సాటి ఇంకెవరూ రారన్నది నిర్వివాదాంశం. అంత గొప్పగా ఆయన ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు.

రామాయణం కేవలం పౌరాణిక గాధ కాదు.. అది చరిత్ర.. అని నమ్ముతోంది హిందూ సమాజం. అందులోని పాత్రల్ని మోడ్రనైజేషన్ పేరుతో, సినిమాటిక్ లిబర్టీ తీసుకుని వికృతంగా చూపించాలనుకోవడం దుర్మార్గం. ఈ విషయమై ‘ఆదిపురుష్’ సినిమాపైన పెద్దయెత్తున విమర్శలు వస్తున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us