Mallika Sherawat: హీరోల‌తో గ‌డ‌ప‌లేద‌ని చాలా సినిమాల నుండి తొల‌గించారు: హీరోయిన్

Mallika Sherawat: మీటూ ఉద్య‌మం త‌ర్వాత చాలా మంది అందాల భామ‌లు గ‌తంలో జ‌రిగిన చేదు అనుభ‌వాల‌ని మీడియా ముందుకు వ‌చ్చి చెబుతున్నారు. హీరోలు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల వ‌ల‌న తాము ఎంత బాధ‌లు ప‌డ్డారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు వివరిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ శృంగార నాయికగా చెలామణి అయిన మల్లికా శెరావత్ తన‌కు ఎదురైన చేదు అనుభ‌వాలు వివ‌రించింది.

Mallika Sherawat

మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన మ‌ల్లికా మ ద్దు సీన్లు, బికినీ సీన్లలో ఎలాంటి బెరుకు లేకుండా నటించి అంద‌రి దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకుంటుంది. మ‌ర్డ‌ర్ సినిమా త‌ర్వాత మ‌ల్లికా ఫేట్ అనేక సినిమా అవ‌కాశాలు ఆమె త‌లుపు త‌ట్టాయి. అయితే కొంద‌రు హీరోల కోరిక‌లు తీర్చిన కార‌ణంగా చాలా సినిమాల నుండి త‌ప్పించార‌ని మ‌ల్లికా చెప్పుకొచ్చింది.

గ‌తంలో ఈ విష‌యంపై మాట్లాడిన తాజాగా మ‌రోసారి స్పందించింది. . ‘‘నటిగా నేను కెరీర్‌ మొదలుపెట్టినప్పుడు ఇప్పుడున్నంత మీడియా లేదు. అప్ప‌ట్లో న‌టి సినిమాల‌లో రాణించాలి అంటే హీరోతో గ‌డ‌ప‌డం త‌ప్ప‌ని స‌రి. కావాల‌నే కొందరు బోల్డ్ సీన్స్ కావాల‌నేవారు. హీరోలతో గడపడానికి నేను అంగీకరించలేదని చాలా సినిమాల నుంచి నన్ను తొలగించారు. పైగా నాపై చాలా నిందలు వేశారు.

ముద్దు సీన్‌లో షార్ట్ స్క‌ర్ట్ వేసుకొని న‌టిస్తే నీతి లేని అమ్మాయిలుగా చిత్రీక‌రించేవారు. ‘ఆన్‌ స్ర్కీన్‌ రొమాంటిక్‌గా చేసినప్పుడు నిజజీవితంలో ఎందుకు కుదరదు అంటున్నావు’ అని అడిగిన హీరోలూ ఉన్నారు. ఇలాంటి ధోర‌ణి ఇప్ప‌టికీ సినీ ప‌రిశ్ర‌మలో ఉంది. ప్రస్తుతం నేను లాస్‌ ఏంజెల్స్‌లో చాలా స్వేచ్ఛగా బతుకుతున్నా’’ అని మల్లికా శెరావత్‌ తెలిపారు.

బాలీవుడ్‌ సినిమా ‘ఖ్వాహిష్‌’(2003)తో వెలుగులోకి వచ్చిన మల్లికా శెరావత్‌.. ఆ తర్వాత విడుదలైన ‘మర్డర్‌’ సినిమాతో బోల్డ్‌ నటిగా గుర్తింపు పొందారు. ఈ రెండు చిత్రాల్లోనూ మితిమీరిన గ్లామరస్‌ షో చేశారనే విమర్శలు మూటగట్టుకున్నారు. కెరీర్‌ ఆరంభంలోనే ఇంతకు దిగజారావా అనే కామెంట్లు కూడా ఆమె వినాల్సి వ‌చ్చింది.

50, 60వ దశకాల నాటి సినిమాలంటే త‌న‌కు ఇష్టం అని మ‌ల్లికా ఓ సంద‌ర్భంలో చెప్పింది. వాటిని ఎవరూ బీట్‌ చేయలేరు. అప్పట్లో స్త్రీల కోసం అద్భుతమైన పాత్రలు సృష్టించేవారు. అయితే, రానురాను ఆ సున్నితత్వం, అందులోని అందం మసకబారిపోయింది. ఒక్క మంచి పాత్ర కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది అని పేర్కొన్నారు.