Malavika Sharma: అందాలతో ఎర వేస్తున్న మాళవిక.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ ఫొటోలు
Priyanka - February 2, 2021 / 12:14 PM IST

Malavika Sharma కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన నేల టిక్కెట్టు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ మాళవిక శర్మ. ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులని అలరించినప్పటికీ సినిమా ఫ్లాప్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. రీసెంట్‌గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ‘రెడ్‘ సినిమాలో ఆమె నటించింది. ఈ సినిమాలో రామ్‌తో పాటు హీరోయిన్ మాళవికను సరికొత్త లుక్‌లో చూపించారు. ఇటీవల ఈ మూవీ ప్రెస్ మీట్‌లో పసుపు రంగు డ్రెస్‌లో మెరిసిన మాళవిక అందాల విందుతో అందరిని కనువిందు చేసింది.
ఫిబ్రవరి 1న మాళవిక తన 23వ పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సందర్భంగా గ్రీన్ కలర్ శారీలో ఎద అందాలను చూపిస్తూ ఫొటో షూట్ చేసింది. మత్తెక్కించే చూపులు చూస్తూ మాళవిక చేసిన రచ్చ నెటిజన్స్‌కు కంటి పై కనుకులేకుండా చేసింది. ఇప్పటికీ మాళవిక ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉన్నాయి. సినిమాలతో రాని గుర్తింపు కనీసం ఇలా అయిన సంపాదించుకోవాలని మాళవిక తాపత్రయపడుతుంది.