Malavika Mohanan : బ్లాక్ హాట్ ‘మాస్టర్’ పీస్ గ్లామర్.! రాకింగ్ లుక్స్‌లో మాళవికా మోహనన్.!
NQ Staff - January 6, 2023 / 10:24 PM IST

Malavika Mohanan : ‘మాస్టర్’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. తమిళ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల్నీ మెప్పించిందీ అందాల రాక్షసి.
‘మాస్టర్’, ‘మారన్’ తదితర తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో అడుగుపెట్టింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన స్ర్టెయిట్ తెలుగు సినిమాలో నటిస్తోంది మాళవికా మోహనన్.
ట్రెండ్ సెట్టర్ మాళవిక..!
విజయ్ దేవరకొండతో ‘హీరో’ సినిమాకి మాళవిక మోహనన్ హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే, అనివార్య కారణాల వల్ల కొంత షూటింగ్ జరుపుకున్న ఆ సినిమా ఆగిపోయింది. అలా ఎప్పుడో టాలీవుడ్‌ని టచ్ చేయాల్సిన మాళవిక మోహనన్ కాస్త లేట్‌గా అయినా లేటెస్టుగా ఎంట్రీ ఇచ్చింది.
చేసినవి కొన్ని సినిమాలే అయినా, స్టార్ హీరోలతో నటించడం వల్లనో ఏమో తెలీదు కానీ, పిచ్చ క్రేజ్ దక్కించుకుందీ అందాల భామ. మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకోవడం వల్ల, ఫ్యాషన్‌పై మంచి పట్టుంది మాళవికకు.
ఆ ఫ్యాషన్‌తోనే డిఫరెంట్ ట్రెండ్స్ ట్రై చేస్తూ, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంటుంది. తక్కువ టైమ్‌లోనే అనూహ్యమైన క్రేజ్ దక్కించుకున్న మాళవిక సోషల్ మీడియాలో చాలా చాల యాక్టివ్‌గా వుంటుంది. తాజాగా బ్లాక్ హాట్ లుక్స్‌తో కుర్రోళ్లను కిర్రాకెత్తిస్తున్న పిక్స్ పోస్ట్ చేసింది. ఈ ఫోజులు నెట్టింట వైరల్‌గా మారాయి.