Malavika Mohanan: మాళవిక మోహనన్ న్యూ లుక్ అదుర్స్..

Malavika Mohanan: మాళవిక మోహనన్.. తమిళం, మళయాలం సినిమాల్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్ట్రస్. 2013లో పట్టంపోలే అనే మలయాళం సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తర్వాత నిర్ణయకం అనే మళయాలం సినిమా, నాను మట్ట వరలక్ష్మి అనే కన్నడ సినిమాలో నటించింది. చాలా తక్కువ సమయంలోనే పెద్ద హీరోలతో సినిమాలో నటించే చాన్స్ కొట్టేసిన మాళవిక.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అందరి దృష్టికి ఆకట్టుకుంటుంది.

2019లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పేట సినిమాలో నటించే చాన్స్ దక్కించుకుంది. 2021లో తమిళ స్టార్ దళపతి విజయ్ హీరోగా తీసిన మాస్టర్ సినిమాలో నటించే అవకాశాన్ని సొంత చేసుకుంది. ఈ సినిమాతో చాలా పాపులర్ అయింది ఈ అమ్మడు.. ఇలా పెద్ద హీరోలతో వరుసగా నటిస్తున్న ఈ భామ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్‌ను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ మతి పోగోడుతున్నది. అందాలను ఆరబోయడంలో అసలు వెనక్కి తగ్గడం లేదు. ఈ అమ్మడు రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రతిసారీ హాట్ ఫొటోలతో కుర్రకారును కట్టిపడేసే ఈ భామ.. ప్రస్తుతం రెడ్ కలర్ పంజాబి డ్రెస్‌లో దిగిన ఫొటోను తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. తను ఏ ఫొటో పోస్ట్ చేసిన ఫ్యాన్ పండగ చేసుకుంటున్నారు. హీరోయిన్‌గా కాకుండా ఎప్పటికప్పుడు తన ఫొటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతున్నది మాళవిక.. హాట్ ఫొటోలను ఎక్కువగా పోస్ట్ చేసే ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో క్రేజ్ సాంపాదించుకుంది. ఆమె ధనుష్ హీరోగా ఉన్న సినిమాలో, యుద్ర అనే మరో సినిమాలో చాన్స్ దక్కించుకుంది. ఈ అమ్మడు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో వివిధ పాత్రల్లో పలు సినిమాల్లో నటించింది మళవిక. మరి ఈ భామ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోపై మీరూ ఓ లుక్కెయ్యండి.