malaika : పొట్ట‌పై స్ట్రెచెస్‌.. న‌టి ముస‌లిదైందంటూ నెటిజ‌న్స్ విమ‌ర్శ‌లు

malaika :  మలైకా అరోరా.. ఈ పేరు వింటేనే కుర్రాళ్ళకు ఎక్కడలేని ఆనందం. అందులోనూ మలైకా చేసే ఫిట్నెస్ ఫీట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. హాఫ్ సెంచరీకి దగ్గరైనా.. ఇంకా హాట్ పిక్స్ తో, టీనేజ్ అమ్మాయిలకు ఏమాత్రం తీసుకుపోకుండా ఉంటుంది. టైట్ ఫిట్ డ్రస్ తో క్రేజీగా మారింది ఈ బ్యూటీ. ఇప్పుడు లేటెస్ట్ గా తన సోషల్ మీడియా అకౌంట్ లో యోగా చేస్తూ ఇచ్చిన పోజులతో కుర్రకారు చిత్తైపోతున్నారు. అయితే లేటెస్ట్ గా తాను పెట్టిన ఫోటోలపై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

ఇటీవల మలైకా ఫిట్ నెస్ ఫ్రీక్ గా ఉండటానికి చేసే వీడియోలు, ఫోటోలు నెటిజన్లని ఆశ్చర్యపడేలా చేశాయి. ఆ ఫోటోల్లో ఆమె నడుము చుట్టూ స్ట్రెచెస్ కనిపించాయి. ఇప్పటివరకు ఓకే కానీ.. ఎంత దాచలన్నా దాచలేనిది వయస్సు మాత్రమేనంటూ.. అది ఎప్పటికైనా బయటపడుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా మలైకా ఈ ఫోటోలో ఏజ్డ్ ఉమెన్ లా కనిపించడం కూడా ఈ కామెంట్స్ కి కారణమైంది. దీంతో మలైకాని సోషల్ మీడియాలో తెగ ఆడేసుకుంటున్నారు. అయితే మలైకా అరోకా ని ఈ ఫోటోల్లో ఇచ్చిన పోజులకు సపోర్ట్ చేసిన వారు కూడా ఉన్నారు. స్ట్రెచ్ మార్క్స్ అంటే అమ్మతనానికి తీపి గుర్తులని.. అది ప్రెగ్నెంట్ గా ఉన్న ఆడవాళ్ళకి సహజసిద్దమంటూ పోస్ట్ చేసారు. రీసెంట్ గా తన ఫిట్ నెస్ ని కాపాడుకోవడంలో చేస్తున్న ప్రయత్నాల్లో కనిపించిన ఫోటోస్ కి నెటిజన్లు ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు.

మలైకా అరోరా ఎలాగైనా సరే తనపై వచ్చిన కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి డిసైడ్ అయ్యిన మలైకా యోగాని మరింత సీరియస్ గా తీసుకుంది. వీటికి సంబంధించిన ఫోటోల్ని లేటెస్ట్ గా ఫోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో తాను బంధనాసనాన్ని పరిచయం చేసింది. ఈ ఫోటోలో స్లిమ్ గా.. చూడ్డానికి ఫ్లైఓవర్ బ్రిడ్జిలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ కి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.

Advertisement