PSPK28: పవన్ కళ్యాణ్ 28వ సినిమాపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

PSPK28: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే ఫ్యాన్స్ కి వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. అలాంటిది ఆయన సినిమా అంటేఏ రేంజ్ లో అభిమానం చూపిస్తారో తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమాల లిస్ట్ లో అందరి దృష్టి పీఎస్ పీకే 28 సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అది కూడా గబ్బర్ సింగ్ లాంటి జబర్థస్త్ కాంబినేషన్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మరో సినిమానే pspk 28.

Makers Clarity on PSPK28 Movie
Makers Clarity on PSPK28 Movie

ప్రస్తుతం ఈ సినిమా మేకింగ్ పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమా థీమ్ పోస్టర్ ను మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేశారు. ఈ థీమ్ పోస్టర్ లో ఇండియా గేట్, బుల్లెట్ బైక్ తో పాటు పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని చూపించారు. దీనికి సంబంధించి మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది ఫిల్మ్ టీమ్. ఇది ఫ్యాన్ మేడ్ ఫోటోగా అభిమానులు ఆదరిస్తున్నారు. దీంతో ఈ సినిమాకి సంబందించి టైటిల్ కూడా దాదాపు కన్ఫర్మ్ అయ్యినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై హరీష్ శంకర్ టీమ్ స్పందించింది.

నిజానికి ఉగాదికి ప్రకటించాల్సిన సినిమా పేరు కరోనా కారణంగా వాయిదా పడినట్లు వివరించారు. అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలనుకున్నారు. అందుకే ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్స్ లేవని.. ఏదైనా ఉంటే తాము అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు. అభిమానుల అంచనాలను ఖచ్చితంగా నెరవేరుస్తామని డైరెక్టర్ తెలిపారు. ప్రస్తుతం మనందరం కరోనాను ఎదుర్కోవాలి అని ఫిల్మ్ టీమ్ తెలియజేసింది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీర మల్లు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. దాంతో పాటు రానా దగ్గుపాటి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో వకీల్ సాబ్ సినిమాతో తన అభిమానులను అలరించారు.