MAJOR : 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. అడివి శేష్ ప్రధాన పాత్రలలో శశి కిరణ్ తిక్కా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జూలై 2న విడుదల చేయనున్నారు. ఇటీవల చిత్ర గ్లింప్స్ విడుదల చేయగా, ఇది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది.శోభిత ధూళిపాళ, బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ నాయికలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోనీ పిక్చర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఎ ప్లస్ ఎస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

జూలై 2న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. అయితే ఈ సమయంలో చిత్ర దర్శకుడు శశి కిరణ్ తండ్రి తిక్క సూర్యనారాయణ కన్నుమూశారు . ఈ విషయాన్ని అడివి శేష్ తెలియజేశారు. మా దర్శకుడు శశి కిరణ్ తండ్రి కన్నుమూయడం ‘మేజర్’ టీమ్ మొత్తాన్ని విషాదంలోకి నెట్టిందని చెప్పుకొచ్చారు. సూర్యనారాయణ మృతికి మేజర్ చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. శశి కిరణ్ 2018లో వచ్చిన గూఢాచారి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే.