MAHESH BABU: క‌రోనా దెబ్బ‌కు మ‌హేష్ మూవీ వాయిదా.. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తాం అన్న మేక‌ర్స్

గ‌త ఏడాది గ‌డగ‌డ‌లాడించిన క‌రోనా ప్ర‌పంచం మొత్తాన్ని అస్త‌వ్య‌స్తం చేసింది. అన్ని రంగాలు క‌రోనా దెబ్బ‌కు కుదేల‌య్యాయి. సినీ ప‌రిశ్ర‌మ సంగ‌తైతే ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. దాదాపు తొమ్మిది నెల‌ల పాటు సినిమ షూటింగ్స్, థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. ఈ ఏడాది క‌రోనా సెకండ్ వేవ్ వ‌ల‌న మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితి త‌లెత్తింది. ఇప్ప‌టికే షూటింగ్స్, థియేట‌ర్స్ అన్ని ష‌ట్‌డౌన్ కాగా, ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప‌లు సినిమాల రిలీజ్‌లు వాయిదా ప‌డ్డాయి. లవ్‌స్టోరీ, టక్‌ జగదీష్‌, విరాటపర్వం చిత్రాలు అన్నీ వాయిదా పడ్డాయ్. ఇంకా చిరంజీవి ఆచార్య, వెంకటేష్‌ నారప్ప, బాలకృష్ణ అఖండ, రవితేజ ఖిలాడి, అఖిల్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ సినిమాలు ఈ సమ్మర్ కు విడుదల కావాలి.. కానీ కరోనా వ్యాప్తి ఎక్కువ కావ‌డం వ‌ల‌న వాయిదా వేశారు.

తాజాగా మ‌హేష్ బాబు నిర్మాణంలో అడివి శేష్ హీరోగా రూపొందుతున్న మేజ‌ర్ కూడా వాయిదా ప‌డింది. దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ రియల్ లైఫ్ చిత్రం “మేజర్” చిత్రం ఇండియన్ రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందింది. పాన్ ఇండియన్ చిత్రంగా జూలై 2 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకోగా, ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో మూవీని వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతా స‌ద్ధుమ‌ణిగాక కొత్త విడుద‌ల తేదీని అనౌన్స్‌చేస్తామ‌ని అంటున్నారు. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల, సహా ప్రకాష్ రాజ్ తదితరులు నటించగా శ్రీ చరణ్ పాకల సంగీతం అందించాడు. అలాగే ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు సహా ఏ ప్లస్ ఎస్ మూవీస్ వారు కలిసి సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.