Dhookudu: దూకుడు యానివర్సరీ ప్లాన్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్.. ఆ రోజు రచ్చ రచ్చే..

Dhookudu: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్స్ అందిస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాడు. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీలకు పెట్టింది పేరైన పరశురాం దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

Maheshbabu Fans to Celebrate Dhookudu 10th Anniversary
Maheshbabu Fans to Celebrate Dhookudu 10th Anniversary

గత ఏడాది లాక్‌డౌన్ సమయంలోనే మహేశ్ బాబు తన తదుపరి చిత్రంగా ‘సర్కారు వారి పాట’ను చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పుడు కరోనా ప్రభావంతో ఇది వెంటనే ప్రారంభం కాలేదు. ఈ చిత్రం కోసం ఇటీవలే మూడో షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ గోవా వెళ్లింది. ప్రస్తుతం హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో జరపబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అంటున్నారు.

అయితే మహేష్ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో దూకుడు ఒకటి. ఇందులో డైలాగ్స్, యాక్షన్ సీన్స్, పాటలు అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. కానీ దిమాక్‌ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు..’ అంటూ మహేశ్‌బాబు సందడి చేసాడు’. శత్రువులపై పగ తీర్చుకునే కొడుకుగా మహేశ్‌.. ఆయన పోలీసు గెటప్‌.. బ్రహ్మానందం, ఎమ్‌ఎస్‌, బళ్లారి బాబు కామెడీ.. అదరగొట్టే ఫ్యామిలీ ఎమోషన్స్.. ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి.

ఈ సినిమా స్క్రిప్టు తయారు చేయడానికి రచయిత గోపీ మోహన్‌, దర్శకుడు శ్రీను వైట్ల ఏడాదిపాటు శ్రమించారు. మహేశ్‌-శ్రీనువైట్ల సినిమా కావడంతో సంగీత దర్శకుడు తమన్‌ దీన్ని మరింత ఛాలెంజ్‌గా తీసుకుని ఆల్బమ్‌ రూపొందించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలులు కొట్టి, టాలీవుడ్‌ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది.

ఈ బ్లాక్‌బస్టర్‌ విడుదలై సెప్టెంబనర్ 23 చిత్రానికి పదేళ్లు. ఈ సందర్భంగా ఆంద్రప్రదేశ్, తెలంగాణాలలో ఈ చిత్రానికి సంబంధించి 20 స్పెషల్ షోస్ ప్లాన్ చేశారట. హైదరాబాద్ లో రెండు, సీడెడ్లో ఆరు, ఉత్తరాంధ్రలో రెండు, వెస్ట్ లో మూడు, కృష్ణాలో ఒకటి, నెల్లూరులో రెండు, బెంగళూరులో ఒక థియేటర్ లో చిత్ర ప్రదర్శన జరగనుంది. రేపు అభిమానులకు పండుగ వాతావరణం తప్పక ఉంటుంది.