MAHESH BABU: స‌చిన్‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన మ‌హేష్ బాబు..!

MAHESH BABU క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ అంటే తెలియ‌ని క్రికెట్ ల‌వ‌ర్ లేరంటే అతిశ‌యోక్తి కాదు. భారతీయుల‌కు క్రికెట్‌పై ఇంత ఆస‌క్తి పెర‌గ‌డానికి కార‌ణం స‌చిన్ ముఖ్య కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. 1973 ఏప్రిల్ 24న జ‌న్మించిన స‌చిన్ కెరీర్‌లో ఎన్నో విజ‌యాలు చ‌విచూశాడు. అవార్డులు రివార్డులుఅందుకున్నారు. 24 ఏండ్ల పాటు వెనుదిరిగి చూసుకోకుండా క్రికెట్ ఆడాడు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ లలో కూడా తను ఆడిన తొలి మ్యాచ్ లలోనే సెంచరీలు సాధించి ఆ ఘనతను పొందిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.

భారతదేశం తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడటానికి సచిన్ 15 నవంబర్ 1989 న తొలిసారిగా మైదానంలోకి దిగాడు. ఆ సమయంలో అతడి వ‌య‌సు 16 సంవత్సరాలు. ఇక 2013 నవంబర్ 15.. సచిన్ టెస్ట్ క్రికెట్ చివరి ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో సచిన్ 74 పరుగులు చేశాడు. భారత ప్రభుత్వం అత‌నికి అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఆయనకు ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్. స‌చిన్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఈ రోజు ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా సినీ ,క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ ద్వారా స‌చిన్‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. క్రికెట్ మ‌నంద‌రికి గుర్తుండిపోయేలా రీ డిఫైన్ చేసిన స‌చిన్‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు.. మీరు ఎల్ల‌ప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను అని మహేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement