Mahesh babu:తండ్రి బ‌ర్త్‌డే… అమిత‌మైన ప్రేమ‌ను పంచిన మ‌హేష్ బాబు

టాలీవుడ్ లెజండ‌రీ స్టార్స్‌లో సూప‌ర్ స్టార్ కృష్ణ ఒక‌రు. ఎన్నో అద్భుత‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన కృష్ణ ఈ రోజు 78వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ప్ర‌తి ఏడాది ఆయ‌న బ‌ర్త్‌డేని ఫ్యామిలీ స‌భ్యులు ఘ‌నంగా జ‌రిపేవారు. కాని కరోనా పరిస్థితుల కారణంగా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం లేదు. అయితే కృష్ణ బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడు మ‌హేష్ బాబు తండ్రికి ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌త్యేక విషెస్ అందించారు.

తన ట్విట్టర్ ఖాతాలో తండ్రి కృష్ణతో కలిసి దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ”హ్యాపీ బర్త్ డే నాన్న, నేను ముందుకెళ్లడానికి నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు ఊహించనంతగా మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంటాను” అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు మహేష్. మ‌హేష్ ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ప్ర‌తి ఏడాది త‌న తండ్రి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా త‌న మూవీస్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చే మ‌హేష్ ఈ సారి క‌రోనా వ‌ల‌న వాయిదా వేశారు. ప్ర‌స్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ మూవీ చేస్తున్నారు మహేష్. ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ మూవీ చేయ‌నున్నాడు మ‌హేష్‌.