Mahesh : మహేష్ – పూజా హెగ్డే జంటగా త్రివిక్రం సినిమా..?

Mahesh : మహేష్ – పూజా హెగ్డే జంటగా మరోసారి నటించబోతున్నారా.. అవునన్న మాటే బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దుబాయ్‌లో నెలరోజుల భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్ర బృందం సెకండ్ షెడ్యూల్ కూడా దుబాయ్‌లో ప్లాన్ చేశారట. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు గోవాలో కూడా ఓ చిన్న షెడ్యూల్ ప్లాన్ చేసినప్పటికి కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ రెండు షెడ్యూల్స్ క్యాన్సిల్ చేశారు. ఈ నేపథ్యంలో 25 రోజుల పాటు హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తాజా సమాచారం.

mahesh-pooja hegde trivikram movie
mahesh-pooja hegde trivikram movie

యూనివర్సల్ కాన్సెప్ట్‌తో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతుండగా 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడని వార్తలు సంగతి తెలిసిందే. మహేష్ బాబు అలాగే, రాజమౌళి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి చాలా సమయం పట్టేలా ఉండటంతో ఈ గ్యాప్‌లో మహేష్ బాబు మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా పూర్తి చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుండగా ఆ తర్వాత మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కే చాలా సమయం పడుతుందట. అందుకే ఈ లోపు మహేష్ మరో సినిమా చేయాలని డిసైడయ్యాడట.

Mahesh :మహేష్ – త్రివిక్రం సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ మే 31న..?

ఇక మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ – హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తారని సమాచారం. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనుందని తెలుస్తోంది. ఇంతక ముందు మహేష్ బాబు – పూజా హెగ్డే కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అందుకే మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందని సమాచారం. ఇక మహేష్ – త్రివిక్రం సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా రానుందని తెలుస్తోంది.

Advertisement