SSMB 28: త్రివిక్ర‌మ్ సినిమాపై నోరు విప్ప‌ని మ‌హేష్‌.. ఇంత సైలెంట్‌కు కార‌ణం ఏంటి?

మ‌హేష్ బాబు- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అంటే అభిమానుల‌లో ఏ రేంజ్ అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అతడు’ (2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో చిత్రం రూపొందనుంది. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాగా, 11 ఏళ్ల త‌ర్వాత మూవీ రానుండ‌డంతో అభిమానుల‌లో అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేశ్‌బాబు తండ్రి బర్త్‌ డే (మే 31) సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనుండ‌గా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. అయితే త‌న ప్ర‌తి సినిమాపై సోష‌ల్ మీడియా ద్వారా కాని లేదంటే డైరెక్ట్‌గా కాని స్పందించే మ‌మేష్ బాబు త‌న 28వ చిత్రంపై ఒక్క ట్వీట్ చేయ‌లేదు. క‌నీసం రీ ట్వీట్ కూడా చేయ‌లేదు. దీనిపై ఇటు అభిమానుల‌లోను అటు ఇండ‌స్ట్రీలోను ఆస‌క్తిక‌ర చర్చ నడుస్తుంది. అయితే మూవీ లాంచింగ్ రోజు సినిమా గురించి మాట్లాడ‌తాడేమో అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.

Advertisement