TRIVIKRAM: ఎన్టీఆర్‌కు నచ్చని క‌థ‌ను త్రివిక్ర‌మ్ మెచ్చాడా.. అస‌లు క‌థ ఏంటి?

సినీ ఇండ‌స్ట్రీ అంటే అద్భుతాల ప్రపంచం అనే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ఒక్కోసారి ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుండ‌డం, వాటిని చూసి మ‌నం ఆశ్చ‌ర్య‌పోవ‌డం జ‌రుగుతూ ఉంటుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది హీరోలు చాలా క‌థ‌ల‌ను రిజెక్ట్ చేయ‌డం, ఆ క‌థ‌ల‌తో వేరే హీరో సినిమాలు చేసి మంచి హిట్ కొడుతుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. అయితే శ‌నివారం రోజు మోస్ట్ అవైటెడ్ కాంబినేష‌న్‌కు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. పదకొండేళ్ళుగా అభిమానులు ప్రేక్షకుల నిరీక్షణకు తెరదించారు.

మ‌హేష్ బాబు- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన అత‌డు ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ మ‌హేష్ – త్రివిక్ర‌మ్ క‌లిసి ఖ‌లేజా అనే సినిమా చేశారు.ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించ‌క‌పోయిన ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. అయితే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లోమ‌రో సినిమా చూడాని ప్రేక్ష‌కులు ఎంత‌గా ఎదురు చూస్తున్న నేప‌థ్యంలో #SSMB28′ ప్రాజెక్ట్‌కు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చిన్నబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మహేశ్ కొత్త సినిమా ప్రకటనతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ప్ర‌స్తుతం మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ సినిమా క‌థ‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ నడుస్తుంది. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన క‌థ‌తోనే మ‌హేష్‌తో త్రివిక్ర‌మ్ సినిమా చేస్తున్నాడ‌ని అంటున్నారు. గ‌తంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో నిర్మాత చినబాబు ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్తుందనుకుంటుండగా జూనియ‌ర్ .. కొర‌టాల శివ‌తో సినిమా చేస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో త్రివిక్ర‌మ్ సినిమా ఏమైంద‌నే అనుమానం క‌లిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో మ‌హేష్ సినిమా త్రివిక్ర‌మ్ చేస్తున్నాడ‌ని గుస‌గుస‌ల వినిపిస్తున్నాయి. గతంలో త్రివిక్రమ్ ‘అతడు’ కథని కూడా ముందు పవర్ కళ్యాణ్ ని చెబితే రిజెక్ట్ చేశాడు. దాన్ని తీసుకొని మహేశ్ దగ్గరకు వెళ్తే ఒప్పుకున్నాడు. వెంట‌నే సినిమా చేశాడు. ఈ సినిమా భారీ విజ‌యం సాధించింది.

Advertisement