NTR-Mahesh: ఎన్టీఆర్ అడ్డాలో మ‌హేష్ ఎంత గెలుచుకున్నాడో తెలుసా?

NTR-Mahesh: బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై సంద‌డి చేస్తున్న యాక్ట‌ర్ ఎన్టీఆర్. ఆయ‌న ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు. ఎన్టీఆర్ ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‏తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రధాన్ పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NTR-Mahesh

తారక్ ప్రముఖ ఛానల్‏లో ప్రసారమవుతున్న మీలో ఎవరో కోటీశ్వరులు షోకు హోస్ట్‏గా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రారంభం రోజే ఈ షోకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా వచ్చారు. ఇక ఆ మొదటి రోజే టీఆర్పీ రెటింగ్ రికార్డ్ సృష్టించింది. ఆయ‌న షోలో పాతిక ల‌క్ష‌లు గెలుచుకోగా, దానిని విరాళంగా అందించాడు. ఇక సెప్టెంబర్ 20న సోమవారం ఈ షోకు డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ అతిథులుగా రాగా, ఈ షో కూడా అద‌ర‌గొట్టింది. ఇక త్వ‌ర‌లో మ‌హేష్ బాబు గెస్ట్‌గా రాబోతున్నాడు.

ఇప్ప‌టికే మ‌హేష్ బాబు.. ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాగా, ఆయ‌న ఈ షోలో పాతిక ల‌క్ష‌ల రూపాయ‌లు గెలుచుకున్న‌ట్టు తెలుస్తుంది. ఈ అమౌంట్ ఎలాగూ ఛారిటీకే ఇస్తారు కాబట్టి సరదా కబుర్ల నడుమ సాగిన ప్రశ్న, సమాధానం కార్యక్రమంలో మహేష్ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి గెల్చుకున్నది మాత్రం పాతికలక్షలు అని తెలుస్తోంది.

ద‌సరా కానుక‌గా మ‌హేష్‌- ఎన్టీఆర్ షో ప్ర‌సారం కానుంది. ఇక ఎవరు మీలో కోటీశ్వరుడు షో ను రక్తికట్టించాలంటే హోస్ట్ గా ఎన్టీఆర్ వుంటే సరిపోదు.ఇంకా ప‌వ‌ర్ ఫుల్ హీరో కావాలి కాబట్టి ప్రభాస్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరి కొందరి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్టార్ హీరోల‌తో ఎన్టీఆర్ షో భీబ‌త్సంగా ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని చెబుతున్నారు.