Mahesh Babu : మహేష్ బాబు ఫ్యాన్స్ సిద్ధమా? మీకు పూనకాలు తెప్పించే న్యూస్ రాబోతోంది..
Kondala Rao - February 22, 2021 / 06:15 AM IST

Mahesh Babu : ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఈరోజు పూనకాలు తెప్పించే న్యూస్ వచ్చేసింది. అందేంటంటే ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోని ఇవాళో రేపో సినిమా యూనిట్ అఫిషియల్ గా రిలీజ్ చేయబోతోందని అంటున్నారు. ఈ మేరకు వర్క్ మొదలైందని, అయిపోవచ్చిందని చెబుతున్నారు. దీంతో ఈ లేటెస్టు అప్డేట్ ని ప్రిన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నిన్నే (ఆదివారమే) రిలీజ్ అవుతుందని కూడా ఒక మాట అన్నారు. కానీ.. అది జరగలేదు. బహుశా ఇవాళ ప్రేక్షకుల ముందుకు తెస్తారేమో చూడాలి.
ఆగస్టు 9న..
‘అల వైకుంఠపురములో’ పాటలు సూపర్ డూపర్ హిట్ కావటంతో ఆ ఉత్సాహంలో ఉన్న థమన్ ‘సర్కారు వారి పాట’కి కూడా అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడట. ఈమధ్యే దుబాయ్ వెళ్లి ప్రిన్స్ ని కలిసి వచ్చాడని టాక్. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిక్చర్ పాటలను ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు థమన్ స్పందిస్తూ ‘‘ఆగస్టులో కలుద్దాం’’ అన్నారు. అంటే ఆ నెల 9వ తేదీ మహేష్ బాబు పుట్టిన రోజు. కాబట్టి ఆ రోజు పాటలను విడుదల చేస్తారని అంచనా వేస్తున్నారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ ఫిల్మ్ ని రూపొందిస్తున్నారు. ఇందులో తొలిసారిగా ప్రిన్స్, కీర్తి సురేష్ జతకడుతున్నారు. మహేష్ బాబు ఆర్థిక నేరస్తుడిగా, కీర్తి సురేష్ ఒక బ్యాంక్ ఉద్యోగినిగా కనిపిస్తారని తెలుస్తోంది.

Mahesh Babu : very very happy news for prince mahesh babu fans
మరో హ్యాట్రిక్: Mahesh Babu
భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు అనే మూడు సినిమాలు సక్సెస్ కావటంతో ప్రిన్స్ ఇప్పటికే ఒక హ్యాట్రిక్ పూర్తి చేసి ఉన్నాడు. ‘సర్కారు వారి పాట’తో రెండో హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ‘గీత గోవిందం’ విడుదలైన మూడేళ్ల అనంతరం మెగా ఫోన్ పట్టిన పరశురామ్ ‘సర్కారు వారి పాట’ కోసం పక్కా స్క్రిప్టు సిద్ధం చేశారని సమాచారం. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్, జీఎంబీ (ఘట్టమనేని మహేష్ బాబు) ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ కంబైన్డ్ గా నిర్మిస్తున్నాయి.