Mahesh babu : మహేష్ బాబు మీద ‘ ఆ రోజు రాత్రి పోలీస్ కేసు పెట్టారు ‘ పెద్ద సీక్రెట్ బయటపెట్టిన తమ్మారెడ్డి !

Mahesh babu : మహేష్ బాబు గురించి ఇంతకాలం ఈ విషయం ఎవరికి తెలియదు.. తెలిస్తే ఫ్యాన్స్ అంతగా హర్ట్ అయ్యేవారో. మహేష్ బాబు చిన్న వయసులో కోర్టుకెళ్లారా.. అంటే ఇప్పుడు అవుననే మాట వినిపిస్తోంది. ఈ విషయాన్ని తెలిపింది కూడా మరెవరో కాదు ప్రముఖ దర్శక నిర్మాత అని తెలుస్తోంది. అయితే ఆయన అక్కడివరకూ వెళ్లడానికి అసలు కారణం చాలా బలంగానే ఉంది. చాలా ఏళ్ళ క్రితం ఓ సినిమా పైరసీకి గురైతే వరంగల్ లోని సీడీల షాప్ పై మహేష్ దాడి చేశారట. కాస్త దూకుడుగానే ప్రవర్తించాడట. దాంతో అవతలి వాళ్లు రివర్స్ కేసు పెడితే పోలీసుల చుట్టూ తిరగాల్సొచ్చింది.

mahesh-babu-they-cased-a-file-against-mahesh-babu-says-tamma-reddy
mahesh-babu-they-cased-a-file-against-mahesh-babu-says-tamma-reddy

మహేష్ కోర్టుకు వెళ్లారు. విచారణలో భాగంగా తిరగాల్సొచ్చిందని టాలీవుడ్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. మేం పట్టుకుంటే మమ్మల్నే జైల్లో వేస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన క్రాక్ సినిమాకి పైరసీ ముప్పు ఉందని అన్నారు. అది కూడా ఆహా లో స్ట్రీమింగ్ అయ్యాక అంటూ తెలిపారు. ఓటీటీ కాపీ పైరేట్ లకు చేరితే అది ఇంకా ముప్పు అని అది ఎంతో నాణ్యతతో ఉంటుందని చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు తమ్మారెడ్డి. కేవలం చిన్న మొత్తం చెల్లించి ఆహాలో సినిమాలు చూసేందుకు యువతరం సిద్ధంగా లేదని పైరసీనే నమ్ముతారని కూడా ఈ సందర్భంగా తెలిపారు.

Mahesh babu : పైరసీపై అప్పుడు మహేష్ చేసింది పెద్ద సంచలనం..!

ఈ ఫిబ్రవరి 5న ఆహాలో క్రాక్ మూవీ స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా ఆహా బృందాలు పైరసీ నిలువరించడమెలా? అన్న విషయం మీద సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మహేష్ కి గతంలో జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు.ఆహా వాళ్లు కనీసం పైరసీపై ముందుకొచ్చి నిలువరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశంసించారు. మహేష్ బాబు తన కెరీర్ లో చాలా చిన్నవాడు. అతడిని జైలులో వేయకపోయినా.. పైరేట్ లతో పాటు జైలుకు వెళ్ళవలసి రావడంతో బాధపడవలసి వచ్చింది. కోర్టు విచారణల పేరుతో కాల యాపన అయ్యిందని తమ్మారెడ్డి గుర్తు చేశారు. పైరసీపై అప్పుడు మహేష్ చేసింది పెద్ద సంచలనం అయిందని తెలిపారు.

Advertisement