Mahesh babu : మహేష్ బాబు – తమన్నా కాంబినేషన్ మళ్ళీ రిపీట్.. ఫ్యాన్స్ కి పండుగే..!
Vedha - March 7, 2021 / 10:05 AM IST

Mahesh babu : మహేష్ బాబు – తమన్నా కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోంది. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఆగడు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా మహేష్ బాబు కి జంటగా నటించింది. కాని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత మళ్ళీ మహేష్ బాబు – తమన్నా జంటగా సినిమా రాలేదు. కాని గత ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది.

Mahesh babu Tamanna combination repeats again
సినిమాలో ఈ సాంగ్ బాగా ఫాన్స్ ని, ప్రేక్షకులని ఆకట్టుకుంది. దాంతో మహేష్ బాబు అభిమానులు మరోసారి ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని ఆశపడుతున్నారు. ఆ ఆశ తీరబోతుందని సమాచారం. అయితే అది సినిమాలో మాత్రం కాదట. ప్రముఖ పరుపుల కంపెనీకి మహేష్ బాబు – తమన్నా కలిసి యాడ్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ యాడ్ షూటింగ్ లో మహేష్ బాబు, తమన్నా పాల్గొంటున్నారట. త్వరలో ఆ యాడ్ ఏయిర్ లోకి రానుందని తెలుస్తోంది.
Mahesh babu : మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అన్న సినిమా చేస్తున్నాడు.
ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అన్న సినిమా చేస్తున్నాడు. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా శరవేగంగా షూటింగ్ సాగుతోంది. తమన్నా విషయానికొస్తే సూపర్ హిట్ సినిమా సీక్వెల్ ఎఫ్ 3 లో సినిమాతో పాటు యంగ్ హీరో నితిన్ నటిస్తున్న బాలీవుడ్ హిట్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్..అలాగే యంగ్ హీరో సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం సినిమాలు చేస్తోంది.